క్షమాపణలు చెప్పిన సోము వీర్రాజు

21 Mar, 2018 14:00 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాజకీయ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. తాను చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పుకున్నారు. ఇటీవల అసెంబ్లీలో మాట్లాడుతూ తాను ఉపయోగించిన మాటలు కొన్ని కులాలను కించపరిచేలా ఉన్నాయని గ్రహించినట్లు, అందుకుగానూ క్షమాపణలు కూడా చెబుతున్నట్లు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

‘‘గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాధాలు తెలిపే తీర్మానంపై నేను మండలిలో మాట్లాడాను. ఆ సందర్భంగా.. టీడీపీ నాయకులను ఉద్దేశించి కొన్ని పదాలను వాడాను. ప్రధాని మోదీని ఉద్దేశించి కాంగ్రెస్‌ సీనియర్‌ మణిశంకర్‌ అయ్యర్‌ వాడిన పదాలు ఎంత వివాదాస్పదమయ్యాయో గుర్తురాగానే.. నా మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు చైర్మన్‌కు తెలిపాను. నా మాటలతో గాండ్ల కులస్తుల హృదయాలు గాయపడినందున క్షమాపణలు కోరుతున్నా’’ అని వీర్రాజు పేర్కొన్నారు.

సోము ప్రకటన..

మరిన్ని వార్తలు