‘అవుట్‌ సోర్సింగ్‌ పేరిట అమ్ముకునే యత్నం’

29 Sep, 2018 14:30 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : కో- ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం విధిస్తున్న అనుచిత షరతులకు వ్యతిరేకంగా దీక్ష చేస్తానని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రకటించారు. అవుట్‌ సోర్సింగ్‌ పేరిట ఉద్యోగాలను అమ్ముకోవడానికే ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. శనివారం విలేకరులతో మాట్లాడిన వీర్రాజు.. ప్రధాని మోదీని తిట్టేబదులు చంద్రబాబు నాయుడు విష్ణు సహస్రనామాలు చదువుకుంటే మంచిదని హితవు పలికారు. అసలు మోదీ లేకుండా చంద్రబాబు జీరో అని, ఆయనో పెద్ద అబద్ధాల పుట్ట అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోదీ సొంత ఇంటి కలను చంద్రబాబు అద్దె ఇంటి కలగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అనేక చోట్ల ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇందుకు నిరసనగా దీక్షలు చేపతామని వీర్రాజు ప్రకటించారు.

మరిన్ని వార్తలు