కేంద్ర నిధులు తిని మోదీని తిడతారా?

17 Jul, 2018 03:54 IST|Sakshi
కేంద్ర పథకాలపై చంద్రబాబు ఇచ్చిన ప్రకటనలు చూపిస్తున్న వీర్రాజు

చంద్రబాబుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజం

శ్రీకాకుళం రూరల్‌/సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను తినడం.. ప్రధాని మోదీని తిట్టడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు మండిపడ్డారు. శ్రీకాకుళంలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్య, వైద్యం, ఉపాధికి చంద్రబాబు తూట్లు పొడిచారన్నారు. సంక్షేమ పథకాలకు మంజూరైన కేంద్ర నిధులన్నీ దుర్వినియోగం చేశారని మండిపడ్డారు.

మట్టి తవ్వకాల పేరుతో టీడీపీ సర్కార్‌ రూ.13 వేల కోట్లు ఖర్చు చేసిందని.. ఆ డబ్బులతో సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేయవచ్చన్నారు. చంద్రబాబు పాలన దారుణంగా ఉండటం వల్లే వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు జనాలు భారీగా తరలివస్తున్నారని చెప్పారు. కాగా హైబ్రీడ్‌ యానిటీ విధానంలో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పించడానికి సంబంధించి రూ.4,884 కోట్ల పనులకు ప్రభుత్వం టెండర్లు పిలవాలన్న నిర్ణయాన్ని ఎమ్మెల్సీ సోము వీర్రాజు తప్పుబట్టారు. ఈమేరకు సోమవారం గవర్నర్‌ నరసింహన్, సీఎం చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. తరగతి గదుల నిర్మాణానికి ఎస్‌ఎస్‌ఏ కింద కేంద్రం ఈ 18 ఏళ్లలో రాష్ట్రానికి రూ. 50 వేలకోట్లు ఇచ్చిందని గుర్తుచేశారు.

>
మరిన్ని వార్తలు