సోము వీర్రాజు వర్సెస్‌ అఖిలప్రియ

8 Mar, 2018 13:20 IST|Sakshi

మండలిలో టూరిజం అభివృద్ధిపై వీర్రాజు ప్రశ్నలవర్షం

కేంద్రం ఇచ్చిన నిధులు ఏం చేశారని నిలదీత

సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం బుడగల పండుగ పేరిట కోట్లు ఖర్చు పెడుతోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో టూరిజం అభివృద్ధిపై సోము వీర్రాజు, పర్యాటకశాఖ మంత్రి అఖిల ప్రియ మధ్య చర్చ నడిచింది. రాష్ట్రంలో టూరిజం పాలసీయే లేదని, బుడగల పండుగ పేరిట కోట్లు ఖర్చు పెడుతున్నారని, కేరళ కంటే పర్యాటకంగా రాష్ట్రం అభివృద్ది చెందే అవకాశాలు ఉన్నా పట్టించుకోవడం లేదని సోము వీర్రాజు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం టూరిజం అభివృద్ధికి రూ. 250 కోట్లు ఇచ్చినా లంబసింగిలో కనీసం సదుపాయాలు ఎందుకు కల్పించలేదని ఆయన ప్రశ్నించారు.

మంత్రి అఖిల ప్రియ స్పందిస్తూ.. ‘కేంద్రం ఇచ్చిన నిధులకు యూసీలు ఇచ్చాం. నిధులు తక్కువగా ఉండటంతో అన్ని చోట్ల అభివృద్ధి చేయలేకపోతున్నాం. జిల్లాకు మూడు కోట్లు ఇచ్చి కలెక్టర్లను ఖర్చు పెట్టమన్నాం. గండికోట అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాం. రోప్ వే కూడా ఏర్పాటు చేస్తున్నాం’ అని సమాధానమిచ్చారు. 

మరిన్ని వార్తలు