మేడ్చల్‌ సభకు సోనియా, రాహుల్‌

21 Nov, 2018 00:44 IST|Sakshi

అదే సభనుంచి ఎల్‌.రమణ, చాడ వెంకటరెడ్డి, కోదండరాం ప్రసంగాలు

కూటమి అనివార్యతను వివరించడమే లక్ష్యం

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచార వ్యూహాన్ని మార్చింది. ఈ నెల 23న మేడ్చల్‌లో నిర్వహించనున్న బహిరంగసభకు కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియాగాంధీతో పాటు ఆమె తనయుడు, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కూడా రప్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు మేడ్చల్‌ బహిరంగ సభనుంచి రాహుల్, సోనియాలిద్దరూ తెలంగాణ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

అదేసభలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌తో పాటు కూట మి భాగస్వామ్య పక్షాల నేతలు కోదండరాం (టీజేఎస్‌), ఎల్‌.రమణ (టీడీపీ), చాడ వెంకట్‌రెడ్డి (సీపీఐ)లు కూడా తమ సందేశాన్ని ఇవ్వనున్నారు. అటు సోనియా, రాహుల్‌ ద్వారా ఒకే సభ నుంచి ఎన్నికల వాగ్దానాలను ఇప్పించడంతో పాటు కూటమి నేతలను కూడా ఆహ్వానించి, తద్వారా కూటమిలోని పక్షాలన్నీ ఐక్యంగా ఉన్నాయని చెప్పడం, కూటమి ఏర్పాటు అనివార్యతను వివరించడమే లక్ష్యంగా మేడ్చల్‌ సభను నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ యోచిస్తోంది.

మరిన్ని వార్తలు