‘కాలం చెల్లిన పార్టీలవి.. ఇవే చివరి ఎన్నికలు’

5 Jun, 2019 08:44 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే ఎస్పీ, బీఎస్పీలు కూటమి కట్టాయని, ఎన్నికలు ముగియడంతో కూటమి విచ్చిన్నమైందని లోక్‌జనశక్తి చీఫ్‌ రాంవిలాస్‌ పాశ్వాన్‌ వ్యాఖ్యానించారు. 2020లోపు ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ పార్టీలు తలుపులు మూసుకోక తప్పదని, ఆ పార్టీలకు కాలం చెల్లిపోయిందని అభిప్రాయపడ్డారు. కుమ్ములాట కోసమే వారు కూటమి కట్టినట్లుందని, ప్రజాసంక్షేమం వారికి పట్టదని ఆరోపించారు. యూపీ, బిహార్‌తో పాటు దేశ వ్యాప్తంగా కూడా విపక్షాలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయని పాశ్వాన్‌ అన్నారు.  ఆ పార్టీలకు ఇవే చివరి ఎన్నికలను జోస్యం చెప్పారు.

లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్‌లో ఏర్పడిన ‘మహాఘఠ్‌ బంధన్‌’ చీలిపోయిన విషయం తెలిసిందే. దీంతో అధికారం బీజేపీ ఎస్పీ,బీఎస్పీపై విమర్శల వర్షం కురిపిస్తోంది. ఓట్ల కోసమే భూటకపు కూటమి కట్టారని ఆరోపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఊహించిన ఫలితాలు సాధించకపోవడంతో రానున్న ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఎస్పీ, బీఎస్పీ నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్పీ చీఫ్‌ మాయావతి మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. యూపీ ఉప ఎన్నికల్లో అన్ని సీట్లలోనూ ఒంటరిగా పోటీ చేయాలనుకున్నట్లు వెల్లడించారు. ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు