ఆరు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన

8 Mar, 2019 19:02 IST|Sakshi

లక్నో : లోక్‌సభ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థుల ప్రకటనపై వేగం పెంచింది. తొలివిడతగా శుక్రవారం ఎస్పీ ఆరు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో ప్రకటించిన అభ్యర్థుల్లో యూపీ మాజీ సీఎం, అఖిలేష్‌ తండ్రి ములాయం సింగ్‌ యాదవ్‌, మేనల్లుడు ధర్మేంద్ర యాదవ్‌, రామ్‌గోపాల్‌ యాదవ్‌ కుమారుడు అక్షయ్‌ యాదవ్‌ పేర్లు ఉన్నాయి. మెయిన్‌పూరి నుంచి ములాయం సింగ్‌ యాదవ్‌, బదౌన్‌ నుంచి ధర్మేంద్ర యాదవ్‌, ఫిరోజాబాద్‌ నుంచి అక్షయ్‌ యాదవ్‌, ఎతవా నుంచి కమలేశ్‌ కతిరియా, బహ్రెచ్‌ నుంచి షబ్బీర్‌ వాల్మికీ, రాబర్ట్స్‌గంజ్‌ నుంచి భాయ్‌ లాల్‌ బరిలో దిగనున్నారు.

ఎస్పీ రెండో జాబితా కూడా త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ప్రకటించాయి. కాగా అఖిలేష్‌ బాబాయ్‌ రామ్‌ గోపాల్‌ యాదవ్‌ ఎస్పీ  నాయకత్వనికి వ్యతిరేకంగా మరో రాజకీయ పార్టీని నెలకొల్పిన విషయం తెలిసిందే. కానీ  ఇవాళ ఎస్పీ ప్రకటించిన జాబితాలో ఆయన కుమారుడు అక్షయ్‌ పేరు కూడా ఉండటం గమనార్హం.  


 

మరిన్ని వార్తలు