వేరువేరుగా ఎస్పీ- బీఎస్పీ పోటి

29 Apr, 2018 21:09 IST|Sakshi

లక్నో: త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ- బీఎస్పీ వేర్వేరుగా పోటీ చేస్తున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ అధికారం ప్రతినిధి రాజేంద్ర చౌదరి తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్‌, పుల్‌పూర్‌ ఉపఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కూటమిగా పోటీ చేసి బీజేపీని ఓడించిన విషయం తెలిసిందే. ఇకముందు కూడా యూపీలో బీఎస్పీ-ఎస్పీ మధ్య పొత్తు ఉంటుందని అఖిలేష్‌, మాయావతి ఇదివరకే స్పష్టంచేశారు. కర్ణాటకలో మాత్రం రెండు పార్టీలు వేరువేరుగా పోటిచేస్తున్నట్లు ఎస్పీ ప్రకటించింది. బీఎస్పీ అధినేత్రి మాయావతి జేడీఎస్‌తో కలిసి ఎన్నికల్లో పోటి చేస్తున్నట్లు ఎన్నికల ముందే ప్రకటించారు.

జేడీఎస్‌తో పొత్తుపెట్టుకున్న బీఎస్పీ కర్ణాటకలో 20 స్థానాల్లో పోటిచేస్తుంది. ఎస్పీ ఒంటరిగా 27 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలిపినట్లు ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు రాబిన్‌ మాథ్యుస్‌ తెలిపారు. కర్ణాటకలో ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ పర్యటిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నా... ఇంతవరకూ అభిలేష్‌ నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. మాయావతి కర్ణాటకలో మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత దేవెగౌడతో కలిసి మైసూర్‌, చిత్రదుర్గ ప్రాంతాల్లో పలు ర్యాలీల్లో పాల్గొన్నారు. ఎస్పీ- బీఎస్పీ కూటమి  ఉత్తరప్రదేశ్‌కే పరిమితమని, ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో కూటమిలేదని  రాజేంద్ర చౌదరి స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు