సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

14 Nov, 2018 03:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో గ్రేహౌండ్స్‌ బృందాలను రంగంలోకి దించాలని అధికారులు నిర్ణయించారు. మావో యిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో కేంద్ర పారామిలిటరీ బలగాల కన్నా గ్రేహౌండ్స్‌ బలగాలను ఉపయోగించడం మంచిదని పోలీస్‌ శాఖ భావిస్తోంది. దీనిలో భాగంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తుగా భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌ కుమార్‌ పోలీ స్‌ శాఖను ఆదేశించారు.

మంగళవారం సీఈవోతో డీజీపీ మహేందర్‌రెడ్డి, అదనపు డీజీపీ, నోడల్‌ అధికారి జితేందర్, గ్రేహౌండ్స్‌ ఐజీ శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర సరిహద్దులో పరిస్థితి ఏంటన్న అంశాలపై సీఈవో ఆరా తీశారు. వరుసగా వెలుగులోకి వస్తున్న మావోయిస్టు ఎన్నికల బహిష్కరణ పోస్టర్లు, అక్కడ తీసుకునే చర్యలను డీజీపీ నుం చి అడిగి తెలుసుకున్నారు.   

నేతలకు మరింత భద్రత..
యాక్షన్‌ కమిటీ వార్తల నేపథ్యంలో ప్రచారంలో ఉన్న నేతలకు భద్రత పెంచాలని, ప్రతీక్షణం ఏం జరుగుతుందో తెలుసుకునేలా నిఘా అధికారులు వ్యూహా త్మకంగా పనిచేయాలని సూచించినట్టు పోలీస్‌ వర్గా లు తెలిపాయి. సమస్యాత్మకంగా ఉన్న 13 నియోజకవర్గాల్లో ఇప్పటినుంచే కేంద్ర బలగాల మోహరింపుతోపాటు మావోయిస్టు నియంత్రణ చర్యలను వేగి రం చేయాలని, సంబంధిత ఎస్పీలు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఈవో పోలీస్‌ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. 

మరిన్ని వార్తలు