వాజ్‌పేయి జీవన ప్రస్థానంలో ముఖ్య ఘట్టాలు ...!

16 Aug, 2018 17:50 IST|Sakshi

పద్దెనిమిదేళ్ల వయసులోనే క్విట్‌ ఇండియా ఉద్యమం సందర్భంగా అరెస్టయిన యువకుడు ఆ తర్వాత దేశరాజకీయాల్లో గొప్ప రాజనీతిజ్ఞుడిగా పేరుగాంచాడు. బీజేపీ అంటేనే వాజ్‌పేయి, వాజ్‌పేయి అంటేనే బీజేపీ అన్నంతగా పార్టీ, నాయకులు, కార్యకర్తలను ప్రభావితం చేశారు. దాదాపు ఆరేడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు, ఎత్తు,పల్లాలు చవిచూశారు. బీజేపీ పట్ల, ఆ పార్టీ రాజకీయాల పట్ల కేడర్‌ ఆకర్షితులయ్యేందుకు ఆయన ఇమేజీ ఎంతగానో పనిచేసింది. హాస్య చతురత మేళవించిన ప్రసంగాలతో పాటు ఆవేశపూరిత ఉపన్యాసాలకు ఆయన పెట్టింది పేరు... వాజ్‌పేయి జీవితంలోని కొన్ని విశేషాలు...
(అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఫోటో గ్యాలరీ ఇక్కడ క్లిక్ చేయండి)

1924లో గ్వాలియర్‌లో జననం
1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో అరెస్ట్‌
1951లో భారతీయ జనసంఘ్‌ (బీజేఎస్‌) లో చేరిక
1957లో లోక్‌సభ సభ్యుడిగా తొలిసారి ఎన్నిక
1962లో రాజ్యసభ సభ్యుడిగా మొదటిసారి
1968లో బీజేఎస్‌ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ
1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సందర్భంగా అరెస్ట్‌
1977లో జనతాపార్టీ ప్రభుత్వ హయాంలో విదేశాంగ మంత్రిగా నియామకం
1980లో బీజేఎస్‌ను బీజేపీగా మార్పుచేసి ఆ పార్టీ మొదటి జాతీయ అధ్యక్షుడయ్యారు
1996లో తొలిసారి 13 రోజుల పాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించాక, సభలో బలం నిరూపించుకోలేక బీజేపీ ప్రభుత్వ పతనం
1998లో రెండోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ సారధిగా 13 నెలల పాటు బాధ్యతల నిర్వహణ. ఈ సందర్భంగా దేశచరిత్రలోనే రెండోసారి పోఖ్రాన్‌ అణుపరీక్షలు నిర్వహించారు.
 చారిత్రాత్మక ఢిల్లీ–లాహోర్‌ బస్సు సర్వీసు మొదలుపెట్టారు. కార్గిల్‌లో పాకిస్తాన్‌ సైన్యం చొరబాట్లను తిప్పికొట్టేందుకు ‘ఆపరేషన్‌ విజయ్‌’ నిర్వహించారు.
1999లో మూడోసారి ప్రధానిగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
2001లో దేశవ్యాప్తంగా సర్వశిక్ష అభియాన్‌ ప్రారంభం
2004 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చూడడంతో ఆ పదవి నుంచి వైదొలిగారు.
2005లో ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలిగారు.
2009లో గుండెపోటుకు గురయ్యారు
2014లో వాజ్‌పేయి 90వ పుట్టినరోజును ‘సుపరిపాలన దినోత్సవంగా’ నిర్వహణ
2015లో దేశంలోనే అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’ ప్రదానం
2018 జూన్‌లో అనారోగ్యం బారిన పడడంతో ఆసుపత్రిలో చేరిక.

మరిన్ని వార్తలు