ఎస్పీవై నామినేషన్‌ : టీడీపీ, జనసేన హైడ్రామా..!

28 Mar, 2019 12:20 IST|Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అక్కడెవరూ పట్టించుకోకపోవడంతో జనసేన తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. సిట్టింగ్‌ స్థానం నంద్యాల టికెట్‌ను కేటాయించకపోవడంతో ఆయన టీడీపీని వీడారు. జనసేనలో చేరి తన కుటుంబానికి నాలుగు టికెట్లు తెచ్చుకున్నారు. నంద్యాల ఎంపీ అభ్యర్థిగా ఎస్పీవై రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా అల్లుడు సజ్జల శ్రీధర్‌ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే అభ్యర్థిగా పెద్ద కుమార్తె సుజలా రెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే అభ్యర్థిగా అరవిందరాణి పోటీచేస్తున్నారు.

అయితే, ఆయా స్థానాల్లో ఎస్పీవై కుటుంబం పోటీలో ఉంటే టీడీపీ అభ్యర్థులకు ఇబ్బందులు తప్పవని ఇంటలిజెన్స్‌ సర్వేలో వెల్లడికావడంతో పచ్చనేతలు రంగంలోకి దిగారు. ఎస్పీవై రెడ్డి నామినేషన్‌ ఉపసంహరించుకోవాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారు. పోటీనుంచి తప్పుకుంటే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఎరవేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీవై కుటుంబ సభ్యుల నామినేషన్ల ఉపసంహరణ విషయంలో హైడ్రామా నెలకొంది. టీడీపీ చీఫ్‌ చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్‌కల్యాణ్‌ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఎస్పీవైతో మాట్లాడటానికి టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్‌ను ఆయన నివాసానికి పంపినట్టు సమాచారం. టీడీపీ నుంచి నంద్యాల ఎంపీ అభ్యర్థిగా మాండ్ర శివానందరెడ్డి బరిలో ఉన్నారు.

(చదవండి : గోడ దూకితే..  గోడు మిగిలింది!

>
మరిన్ని వార్తలు