'నా అనుమతి లేనిదే నియోజకవర్గానికి రావద్దు'

28 Apr, 2020 08:51 IST|Sakshi

సాక్షి, వరంగల్ ‌: స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య వ్యాఖ్యలు మరోసారి వివాదస్పదంగా మారాయి. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో సోమవారం స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఆయన చేసిన హెచ్చరికలు ఎవరిని ఉద్దేశించినవనే చర్చ మొదలైంది. ‘ఎమ్మెల్యేకు తెలియకుండా ఎమ్మెల్సీ, ఎంపీ, జడ్పీ చైర్మన్, మంత్రి.. ఇలా ఎవరూ నియోజకవర్గాలకు రావొద్దు.. వారంతట వారే వస్తే గ్రూపు రాజకీయాలను ప్రోషించినట్లుగా భావించాల్సి వస్తుంది. తస్మాత్‌ జాగ్రత్త.. పార్టీ గమనిస్తోంది.. ఎంతటి నాయకులైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అంటూ ఈసారి ఆయన తన స్వరాన్ని మరింత పెంచారు.

ఇంతకాలం ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య మధ్య నెలకొన్న విబేధాల కారణంగా ఒకరిపై పరోక్ష వ్యాఖ్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నా యి. అయితే సోమవారం రాజయ్య మాట్లాడుతూ తన ఆహ్వానం లేనిదే నియోజకవర్గంలో ఎవరూ తిరగొద్దంటూ వివిధ పదవుల్లోని ప్రజాప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడడంతో ఈసారి ఆయన ఎవరినీ హెచ్చరించినట్లన్న చర్చ టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జరుగుతోంది. 

అధికార పార్టీలో కలకలం
టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని సోమవారం స్టేషన్‌ఘన్‌పూర్‌లో పార్టీ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాజయ్య చేసిన వ్యాఖ్యలు టీఆర్‌ఎస్‌ కలకలం రేపాయి. నియోజకవర్గానికి ఎవరు రావాలన్నా ఎమ్మెల్యే అనుమతి తప్పని సరని ఆయన హుకూం జారీ చేయడం గమనార్హం. ‘పార్టీలు, నాయకులకు అభిమానులు ఉండొచ్చు. కానీ, దానిని అడ్డం పెట్టుకుని గ్రూపు రాజకీయాలకు పాల్పడితే చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు. (ఆ తేదీనే ఎన్నికలు జరుగుతాయ్‌: ట్రంప్‌)

సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.3 కోట్ల సీడీఎఫ్‌ నిధులు, రూ. 2.5 లక్షల వేతనం విరాళంగా ఇచ్చానని చెప్పుకొచ్చిన ఆయన.. ఇటీవల హైదరాబాద్‌లో కొందరు చెక్కులు ఇచ్చారని, అక్కడ ఇస్తే సముద్రంలో చెంబుతో నీళ్లు పోసినంత సమానమంటూ చెప్పడంపై చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య కొంతకాలంగా గ్రూపు రాజకీయాలు, విబేధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించడం, కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు రెండు గ్రూపుల వారిని వేర్వేరు సమయాల్లో తరలించడం అప్పట్లో వివాదస్పదంగా మారింది. అయితే ఈసారి ‘ఎమ్మెల్సీ, ఎంపీ, జెడ్పీ చైర్మన్, మంత్రి.. నిబంధనలు పాటించకుండా వస్తున్న ఎంతటి పెద్ద నేతలైనా వారిపై చర్యలు తప్పవు.. వారంతా ఎమ్మెల్యే కనుసైగల్లో, ఎమ్మెల్యే ఆహ్వానం మేరకు నియోజవర్గంలోకి రావాలి... అలా కాకుండా ఎవరొచ్చినా గ్రూపు రాజకీయాలకు ప్రోత్సహించినట్లే, గ్రూపు రాజకీయాలు చేస్తే తస్మాత్‌ జాగ్రత్త’ అంటూ హెచ్చరించడం గమనార్హం.

‘ఎవరు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనేది పార్టీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.. పార్టీల్లో ఉన్నప్పుడు నిబంధనలకు కట్టుబడి ఉండాలి.. అందులో అధికార పార్టీకి నిబంధనలు మరింత కఠినంగా ఉంటా యని గ్రహించాలి’ అని సూచించారు. పా ర్టీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే వా జుజరు ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవని రాజయ్య హెచ్చరించడం టీఆర్‌ఎస్‌ నేతల్లో చర్చనీయాంశంగా మారింది.   

మరిన్ని వార్తలు