గాజువాకను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి

4 May, 2018 21:28 IST|Sakshi

విశాఖ ఉక్కు కార్మాగారం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది

గాజువాక బహిరంగ సభలో విజయసాయిరెడ్డి

సాక్షి, విశాఖపట్నం : గాజువాక ఎంతగా అభివృద్ధి చెందుతున్నా.. సమస్యలు కూడా అలానే వెంటాడుతున్నాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లు గడిచినా గాజువాక హౌజింగ్‌ కమిటీ సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు సంఘీభావంగా విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పాదయాత్రలో భాగంగా శుక్రవారం గాజువాకలో నిర్వహించిన బహిరంగ సభలో విజయసాయిరెడ్డి మాట్లాడారు.

ఉక్కు నిర్వాసితులకు చంద్రబాబు మొండిచేయి చూపించారని అన్నారు. ఆర్‌ కార్డు హోల్డర్లకు వయోపరిమితి దాటిపోయిందని అన్నారు. వారికి రూ. 50 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేసినా.. ఇవాళ్లికి చెల్లించలేదని అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. స్టీల్‌ప్లాంట్‌ భూముల్లో స్పోర్ట్స్‌ హబ్‌ కడతానని చంద్రబాబు హామీ ఇచ్చారని, కానీ అది అడియాసే అయిందని అన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే ఆ హామీని నెరవేరుస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు