వంటేరుపై డీజీపీకి ఫిర్యాదు

3 Dec, 2018 16:06 IST|Sakshi
వంటేరు ప్రతాప్‌ రెడ్డి

సాక్షి, గజ్వేల్‌ : గజ్వేల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌ రెడ్డిపై ఓ విద్యార్థి నేత డీజీపీ మహేందర్‌ రెడ్డికి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌, మంత్రి హరీష్‌ రావులకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని ప్రతాప్‌ రెడ్డి తనపై ఒత్తిడి తెస్తూ.. మానసికంగా వేధిస్తున్నారని విద్యార్థి నేత సంజయ్‌ కుమార్‌ డీజీపీని ఆశ్రయించారు. గజ్వేల్‌ సీఎం కేసీఆర్‌ పోటీచేస్తున్న నియోజకర్గం కావడంతో ఈ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొద్ది రోజుల క్రితం పోలీసులు తనను వేదిస్తున్నారని వంటేరు ప్రతాప్‌ రెడ్డి  పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే.

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎన్నికల్లో ప్రయోజనం కల్పించేందుకు తన ఫోన్లను పోలీసు శాఖ ట్యాపింగ్‌ చేస్తోందని ఆరోపిస్తూ..ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్‌కు కూడా ఫిర్యాదు చేశారు. అలాంటి ఒంటేరుపై ఓ విద్యార్థినేత డీజీపీకి ఫిర్యాదు చేయడం ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. సీఎం కేసీఆర్‌ ఓటమే లక్ష్యంగా మహాకూటమి బరిలో నిలపిన ప్రతాప్‌ రెడ్డి.. గత ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగి కేసీఆర్‌కు గట్టి పోటీనిచ్చారు. దీంతో కేసీఆర్‌ కేవలం 19వేల ఓట్ల మెజార్టీతోనే విజయం సాధించారు. ఈ సారి ఎలాగైన విజయం సాధించాలని పట్టుదలతో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కేసీఆర్‌ గెలుపు కోసం మంత్రి హరీష్‌ రావు గజ్వేల్‌లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

మరిన్ని వార్తలు