నిర్భయ ఉదంతం : ‘అలాంటి వ్యాఖ్యలు మానుకోండి’

17 Jan, 2020 19:20 IST|Sakshi

న్యూఢిల్లీ : నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు విషయంలో రాజకీయాలు తగవని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌  హితవు పలికారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ సర్కార్‌ ఉద్దేశపూర్వకంగానే నిర్భయ దోషుల శిక్షను జాప్యం చేస్తోందని బీజేపీ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. 2018 జూలైలో రివ్యూ పిటిషన్‌ కొట్టివేస్తే దోషులను ఉరితీయకుండా ఏం చేశారన్న కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం స్పందించారు.
నిర్భయ ఉదంతంపై ప్రతిపక్ష బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు బాధించాయని అన్నారు.

‘దోషులకు ఉరిశిక్ష పడే విషయంలో మనం ఎందుకు కలిసి పనిచేయకూడదు..? మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని ఆరు నెలల్లోనే శిక్షించే విధంగా ఎందుకు పనిచేయకూడదు..? ఇలాంటివేం ఆలోచించకుండా.. రాజకీయాలే పరమావధిగా నిందలు వేయడం మానుకోండి. కలిసి పనిచేద్దాం. మహిళల కోసం రక్షిత నగరాన్ని తీర్చిదిద్దుదాం’అని కేజ్రీవాల్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.


(చదవండి : చావును వాడుకోకండి.. నిర్భయ తల్లి కన్నీటి పర్యంతం)
(చదవండి : అదంతా అబద్ధం.. నిర్భయ తల్లి ఆశాదేవీ)
(చదవండి : నిర్భయ దోషులకు కొత్త డెత్‌వారెంట్లు జారీ)

మరిన్ని వార్తలు