చంద్రబాబుకు చెప్పినా వినలేదు: సుజనా

14 Jul, 2019 13:18 IST|Sakshi

సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి టీడీపీ విమర్శలు గుప్పించారు. బీజేపీలో చేరిన అనంతరం తొలిసారి విజయవాడ వచ్చిన ఆయన ఆదివారం పార్టీ ఆత్మీయ సమావేశం  పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ..‘కేంద్ర ప్రభుత్వం విషయంలో టీడీపీ చేసింది ధర్మ పోరాటాలు కాదు. అది అధర్మ పోరాటం. ధర్మపోరాట దీక్షలపై చంద్రబాబు నాయుడుకు వద్దని చెప్పినా వినలేదు. కొందరు నేతల మాటలు విని అధర‍్మ పోరాట దీక్షలు చేశారు. పార్టీ అధ్యక్షుడి నిర్ణయానికి కట్టుబడి ఆనాడు బహిరంగంగా మాట్లాడలేకపోయాను. ఇప్పటివరకూ పరోక్ష రాజకీయాల్లో ఉన్నాను. బీజేపీలో చేరాక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నాను. ప్రపంచ దేశాల ముందు దేహీ అనే ప్రధానులే ఉన్నారు కానీ భారతదేశం గొప్పతనాన్ని చాటింది ప్రధాని నరేంద్ర మోదీ. బీజేపీ నిర్ణయాలు ఏపీ అభివృద్ధి వైపే ఉన్నాయి. రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయం అవ్వాలనే నేను భారతీయ జనతా పార్టీలో చేరాను.’అని చెప్పుకొచ్చారు.

>
మరిన్ని వార్తలు