బీజేపీలో చేరిన సీనియర్‌ నటుడు

23 Apr, 2019 13:29 IST|Sakshi

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సన్నీ డియోల్‌ మంగళవారం బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, పియుష్‌ గోయల్‌ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. పంజాబ్‌లోని  గురుదాస్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసే అవకాశముందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

ఈ సందర్భంగా సన్నీ డియోల్‌ మాట్లాడుతూ.. దేశం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో కష్టపడుతున్నారని, మరో ఐదేళ్లు ఆయన ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. యువతకు మోదీ లాంటి నాయకులు చాలా అవసరమని అన్నారు. అజల్‌బిహారి వాజపేయికి మద్దతు ఇచ్చి ఆయనతో కలిసి తన తండ్రి ధర్మేంద్ర పనిచేశారని, అదేవిధంగా తాను కూడా మోదీకి అండగా ఉంటానని అన్నారు. చేతల ద్వారానే రాజకీయాల్లో తానెంటో నిరూపించుకుంటానని చెప్పారు.

గతంలో గురుదాస్‌పూర్‌ నుంచి బీజేపీ తరపున వినోద్‌ ఖన్నా ప్రాతినిథ్యం వహించారు. 2017లో ఆయన మరణించడంతో ఉప ఎన్నిక నిర్వహించగా కాంగ్రెస్‌ అభ్యర్థి సునీల్‌ కుమార్‌ జాఖర్‌ గెలుపొందారు. సన్నీ డియోల్‌ను ఇక్కడి నుంచి పోటీకి దింపి మళ్లీ ఈ స్థానాన్ని దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. శిరోమణి అకాలీదళ్‌తో పొత్తు కొనసాగిస్తున్న బీజేపీ పంజాబ్‌లోని 13 స్థానాల్లో 3 సీట్లలో పోటీ చేయనుంది. అమృత్‌సర్‌, గురుదాస్‌పూర్‌, హోషియాపూర్‌ స్థానాల్లో బీజేపీ బరిలోకి దిగుతోంది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘మోదీని ఆ దేవుడు కూడా కాపాడలేడు’

రీపోలింగ్‌కు కారణం ఎవరు?

టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై కేసు నమోదు

మా ఓటు మేం వేసుకునేలా అవకాశం కల్పించండి..

రీపోలింగ్‌పై టీడీపీకి భయమెందుకు?

లగడపాటి - కిరసనాయిలు ఆడుతున్న డ్రామా..

ఇక నాలుగు రోజులే..

భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ సమీక్ష

ఓట్ల లెక్కింపు పారదర్శకంగా ఉండాలి

మోదీ ప్రధాని కావాలని గేదెలకు పూజ

లోక్‌సభ ఎన్నికలు : ఓటేసిన పెళ్లికొడుకు..!

నన్ను తీర్చిదిద్దింది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి..

కమ్మపల్లిలో ఉద్రిక్తత, మా అమ్మ ఓటు నేనే వేస్తా..

నిజాయితీపరులకే ఓటేయండి: నేగీ

కేదార్‌నాథ్‌లో మోదీ

చివరి ‘మన్‌కీ బాత్‌’ అనిపిస్తోంది!

బీజేపీ నన్ను చంపాలనుకుంటోంది

ఈసీలో అసమ్మతి ‘లావా’సా

నేడే చివరి విడత పోలింగ్‌

లగడపాటి చిలుక పలుకులు..

పోలింగ్‌ అధికారిని  ప్రద్యుమ్న బెదిరించారు