ప్రధానితో సన్నీ డియోల్‌ భేటీ

29 Apr, 2019 03:02 IST|Sakshi
మోదీని ఢిల్లీలో కలిసిన బీజేపీ నేత సన్నీ డియోల్‌

న్యూఢిల్లీ: పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటుడు సన్నీ డియోల్‌ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. డియోల్‌తో కలిసి ఉన్న ఫొటోను ఈ సందర్భంగా ప్రధాని ట్వీట్‌ చేశారు. ‘డియోల్‌ని కలిసినందుకు సంతోషంగా ఉంది. అతనిలోని వినయం, భారతదేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై అతనికి ఉన్న లోతైన అవగాహన నన్ను ఆకర్షించాయి. గురుదాస్‌పూర్‌లో డియోల్‌ విజయానికి మేమంతా కృషి చేస్తున్నాం’అని ట్వీట్‌లో తెలిపారు. అలాగే డియోల్‌ నటించిన సూపర్‌ హిట్‌ సినిమా ‘గదర్‌’లోని ‘హిందుస్తాన్‌ జిందాబాద్‌ హై.. థా.. ఔర్‌ రహేగా’అనే డైలాగ్‌ను కూడా జతచేశారు. దీనికి తామిద్దరం కట్టుబడి ఉన్నామని తెలిపారు. కాగా, దక్షిణ ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ, తూర్పు ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్లకు మేయర్లుగా ఎంపికైన సునీతా కంగ్రా, అవతార్‌ సింగ్, అంజూ కమల్‌కాంత్‌లు కూడా ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని వారికి అభినందనలు తెలిపారు. ఢిల్లీని మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేశారు. కాగా, ప్రముఖ నటుడు ధర్మేంద్ర కుమారుడైన డియోల్‌ ఇటీవల బీజేపీలో చేరారు. గురుదాస్‌పూర్‌ నుంచి పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ సునీల్‌ జఖార్‌పై ఆయన పోటీ చేయనున్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కుటుంబ కథా చిత్రం!

ఒక్కో ఓటుపై రూ.700

అలా అయితే ఫలితాలు మరోలా ఉండేవి: పవన్

రాజ్‌నాథ్‌ రాజీనామాకు సిద్ధపడ్డారా?

రెండు చోట్ల అందుకే ఓడిపోయా: పవన్‌

గడ్కరీ ఓడిపోతాడు.. ఆడియో క్లిప్‌ వైరల్‌!

సీఎంతో విభేదాలు.. కేబినెట్‌ భేటీకి డుమ్మా!

నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కొంటున్నారు

మాయ, అఖిలేష్‌ల ఫెయిల్యూర్‌ స్టోరీ

అంతా మీ వల్లే

బాబు వైఎస్సార్‌సీపీలోకి వెళితే నేను..

కేశినేని నాని కినుక వెనుక..

కొన్నిసార్లు అంతే.. !!

ఎంపీ కేశినేని నానితో గల్లా భేటీ

‘మాతో పెట్టుకుంటే పతనం తప్పదు’

టీడీపీకి ఎంపీ కేశినేని నాని షాక్‌!

చీఫ్‌ విప్‌గా మార్గాని భరత్‌ రామ్‌

‘మహాఘఠ్‌ బంధన్‌’ చీలిపోయింది...

గిరిరాజ్‌కు అమిత్‌ షా వార్నింగ్‌

అఖిలేశ్‌ భార్యను కూడా గెలిపించుకోలేకపోయాడు!

యూపీలో కూటమికి బీటలు..?

జగన్‌ పాలనను.. చూస్తున్నారా చంద్రబాబూ?

సంఖ్యే ముఖ్యం... శాతం కాదు

గాంధీజీపై ఐఏఎస్‌ అధికారిణి వివాదాస్పద వ్యాఖ్య

బదులు తీర్చుకున్న నితీశ్‌

నితీశ్‌ కేబినెట్‌లోకి కొత్త మంత్రులు.. బీజేపీకి కౌంటర్‌!

మళ్లీ అదే జోడీ

‘త్రిభాష’పై తమిళ పార్టీల కన్నెర్ర

రక్షణ బాధ్యతల్లో రాజ్‌నాథ్‌