రాజు స్థానంలో ప్రభు

12 Mar, 2018 19:02 IST|Sakshi

న్యూఢిల్లీ: పౌర విమానయాన శాఖ మంత్రిగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు సోమవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. పి. అశోక్‌గజపతి రాజు ఈ పదవికి రాజీనామా చేయడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిఫారసు మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. 

గతంలో రైల్వే మంత్రిగా పనిచేసిన సురేశ్‌ ప్రభు.. 2017లో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా నియమితులయ్యారు. అంత​కుముందు ఆ శాఖను నిర్వర్తిస్తున్న నిర్మలా సీతారామన్‌ రక్షణ శాఖ మంత్రిగా నియమితులవడంతో వాణిజ్య, పరిశ్రమల శాఖను ప్రభుకు కేటాయించారు. 2000 నుంచి 2002 వరకు వాజపేయి ప్రభుత్వంలో విద్యుత్‌ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు