మంగళగిరిలో సర్వే కలకలం

17 Mar, 2019 20:46 IST|Sakshi

సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో సర్వే కలకలం రేపుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్‌ను టీడీపీ మంగళగిరి అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి ఈ సర్వే జరుగుతుంది. ఖమ్మం, హైదరాబాద్‌ నుంచి వచ్చిన 30 మంది సభ్యుల బృందం ఈ సర్వే చేపట్టింది. ప్రభుత్వ పథకాలు, ఎవరిని ఎన్నుకుంటారు, ఏ టీవీ చూస్తారు, ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారు, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత పనితీరుపై ప్రశ్నలు అడుగుతూ సర్వే నిర్వహిస్తున్నారు. ఓటర్ల జాబితాను దగ్గర ఉంచుకుని..  పన్నెండు ప్రశ్నలతో సర్వే కొనసాగిస్తున్నారు. 

ఏపీలో పలు దొంగ సర్వేలు జరగడం, ఏపీ​ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఐటీగ్రిడ్స్‌ అనే కంపెనీ చేతికి వెళ్లడం ఇప్పటికే ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. లోకేశ్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న నియోజకవర్గంలో ఇలాంటి సర్వేలు చేపట్టడంపై ప్రజలు భయాందోళన చెందుతున్నారు. 

మరిన్ని వార్తలు