ట్విటర్‌ అకౌంట్‌ నిర్వహణపై స్పందించిన సుష్మా స్వరాజ్‌

31 Mar, 2019 17:03 IST|Sakshi
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ (ఫైల్‌)

సాక్షి, న్యూఢిల్లీ: ‘నా ట్విటర్‌ ఖాతాలో నుంచి ట్వీట్లు చేసేది నేనేనని, దెయ్యం కాద’ని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌  చమత్కరించారు. సమిత్‌ పాండే అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ చేసిన ట్వీట్‌కు ఆమె ఈమేరకు బదులిచ్చారు. ‘సుష్మా స్వరాజ్‌ అకౌంట్‌ను ఆమె కాకుండా మరెవరో (పీఆర్‌) నిర్వహిస్తున్నార’ని సమిత్‌ పాండే అనుమానం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశాడు. దీనికి బదులుగా ‘ట్విటర్‌లో యూజర్లు అడిగిన ప్రశ్నలకు మాధానాలిచ్చేది నేనే, నా దెయ్యం కాద’ని సుష్మా తెలిపారు. గతవారం ట్విటర్‌లో మరోవ్యక్తి ‘మిమ్మల్ని మీరు ఎందుకు చౌకీదార్‌ (కాపలాదారు)గా పిలుచుకుంటార’న్న ప్రశ్నకు జవాబుగా.. ఎందుకంటే నేను భారత్‌లో, విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల ప్రయోజనాలకు కాపలా కాస్తున్నానని సుష్మా దీటుగా సమాధానమిచ్చారు.  

మరిన్ని వార్తలు