ప్రజాసంకల్పయాత్రకు సిడ్నీ ప్రవాసాంధ్రుల సంఘీభావం

7 Oct, 2018 19:42 IST|Sakshi

సిడ్నీ: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఆంధ్ర రాష్ట్రమంతటా ప్రజలు నీరాజనాలు పడుతుండగా.. విదేశాల్లోనూ జననేత పాదయాత్రకు ప్రవాసాంధ్రులు పెద్దఎత్తున సంఘీభావం ప్రకటిస్తున్నారు. తాజాగా వైఎస్సార్‌సీపీ సిడ్నీ విభాగం ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రులు  ప్రజాసంకల్పయాత్ర 3,000 కిలోమీటర్ల మైలురాయిని దిగ్విజయంగా పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. సిడ్నీ నగరంలోని పర్రామట్ర పార్క్‌లో కేక్‌ కట్‌ చేసి.. జననేత వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

వైఎస్సార్‌సీపీ సిడ్నీ విభాగం గౌరవాధ్యక్షులు శ్రీరంగారెడ్డి, తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గోవిందరెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, శిరీష్, మనురెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్‌, వైఎస్‌ జగన్‌ అభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జై జగన్ అని నినాదాలు చేస్తూ సిడ్నీ విభాగం సభ్యులు పాదయాత్ర చేశారు. పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త సిద్ధార్థరెడ్డి ఈ సందర్భంగా ఫోన్‌లో మాట్లాడి రాష్ట్ర పరిస్థితులను ప్రవాసాంద్రులకు వివరించారు. ప్రజాసంకల్పయాత్రకు మద్దతుగా చేపట్టిన కార్యక్రమాన్ని చేపట్టిన ప్రసాంధ్రులను అభినందించారు.

పార్టీ సిడ్నీ సభ్యులు రఘు, రాజశేఖర్ మాట్లాడుతూ ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా అని, హోదాను వైఎస్‌ జగన్ మాత్రమే సాదిస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం అబద్ధాలకోరు చంద్రబాబును నమ్మొద్దని రాష్ట్ర ప్రజలకు వారు సూచించారు. రాష్ట్రాన్ని చంద్రబాబు భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సమర్థుడు వైఎస్‌ జగన్‌ మాత్రమేనని అన్నారు.  2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రావడం తథ్యమని, వైఎస్‌ జగన్‌ను ప్రజలు ఆశీర్వదించాలని అన్నారు.

మరిన్ని వార్తలు