ఓటర్ల జాబితా ట్యాంపరింగ్‌

5 Sep, 2018 02:44 IST|Sakshi

మాకు అనుమానాలున్నాయి: ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో ట్యాంపరింగ్‌ జరిగిందన్న అనుమానాలున్నాయ ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నా రు. రాష్ట్రంలో 8 లక్షల కొత్త ఓటర్లు చేరినా కూడా గత నాలుగేళ్లలో 20 లక్షల ఓటర్లు తగ్గారని పేర్కొన్నారు. కొత్తగా చేర్పులు జరిగినా సంఖ్య ఎలా తగ్గిందని ప్రశ్నించారు. జాబితాలో ట్యాంపరింగ్‌ జరిగిందనే అనుమానాలు ఉన్నాయని చెప్పా రు. మంగళవారం గాంధీభవన్‌లో మర్రి శశిధర్‌రెడ్డి అధ్యక్షతన ఎన్నికల కమిటీ భేటీ జరిగింది.

దీనికి ముఖ్యఅతిథిగా ఉత్తమ్‌ హాజరయ్యారు. ముందస్తు ఎన్నికలు, ఓటర్‌ జాబితా, ఎన్నికల సంఘం తదితర అంశాలపై చర్చించారు. ఉత్తమ్‌ మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 7 మండలాలు ఏపీలో కలిపినందున అక్కడ ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. 10 శాతం వీవీప్యాట్‌లను లెక్కపెట్టాలని సుప్రీం కోర్టులో రాజస్తాన్‌ వేసిన పిటిషన్‌ ఉందని, అందులో టీపీసీసీ కూడా కక్షిదారుగా చేరుతుందని పేర్కొన్నారు. ఈవీఎమ్‌ మానిటర్‌ను మాన్యువల్‌ చేయాలని కోరారు.

ఓటర్ల జాబితాపై 7న సమావేశాలు..
ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉన్నట్లు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ తెలిపారు. ఓటర్ల జాబితాతో పాటు ఇతర అంశాలపై జాగ్రత్తగా ఉండాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఓటర్ల జాబి తాపై చర్చించడానికి సెప్టెంబర్‌ 7న అన్ని నియోజకవర్గాల్లో సమావేశా లు నిర్వహిస్తామన్నారు. 9న మండల, డివిజన్‌ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిందిగా కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు.

బూత్‌ కార్యకర్త వరకు ఓటరు జాబితా చేరేలా చర్యలకు ఎన్నికల కమిటీ భేటీలో నిర్ణయం చేసినట్లు చెప్పారు. 2019 జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు నిండిన వారందరినీ ఓటర్ల జాబితాలో చేర్చాలని కోరారు. ఆదివారం జరిగిన ప్రగతి నివేదన సభలోనే కేసీఆర్‌ ఏం చెప్పలేదని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కేసీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు.

జోనల్‌ కోసం ప్రధాని మోదీని ఇస్తావా.. చస్తావా అని నిలదీసిన సీఎం.. విభజన హామీలు, ముస్లిం, గిరిజన రిజర్వేషన్లపై అదే తరహాలో ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉందని, దీనిపై జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల కమిషన్‌ను కోరతామని తెలిపారు. సమావేశంలో పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు