బాబు ప్రెస్‌మీట్‌ చూసి షాకయ్యా: తలసాని 

27 Oct, 2018 03:44 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆపద్ధర్మ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పరామర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సిటీన్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్‌ జగన్‌ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు నెలలుగా జరుగుతున్న డ్రామా లో భాగంగానే వైఎస్‌ జగన్‌పై డాడి జరిగిందని తలసాని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు ప్రెస్‌మీట్‌ చూసి తాను షాక్‌ కు గురయ్యానన్నారు. బాధ్యతాయుతమైన పద విలో ఉన్న ఓ సీఎం మాట్లాడాల్సిన మాటలు ఇవేనా అని ప్రశ్నించారు.

ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంద న్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఫోన్‌ చేసి పరామర్శ చేస్తే దానిగురించి ఏవేవో మాట్లాడటం చంద్రబాబుకు తగదన్నారు. ప్రత్యేక హోదా అడిగితే కేంద్రం కక్ష సాధింపునకు దిగుతోందని మా ట్లాడటం సిగ్గుచేటన్నారు. అలిపిరి వద్ద బాబుపై దాడి జరిగితే ఆనాటి ప్రతిపక్షం స్పందించి పరామర్శ చేసిందన్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న గవర్నర్‌ జరిగిన ఘటన గురించి డీజీపీతో మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. ఘటన జరిగిన గంటలోనే డీజీపీ ప్రెస్‌మీట్‌ పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. జగన్‌ క్షేమ సమాచారం తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని తలసాని చెప్పారు. 

మరిన్ని వార్తలు