‘కాంగ్రెస్‌ నేతలు నిజంగా జోకర్లు, బ్రోకర్లు’

7 May, 2020 12:54 IST|Sakshi
తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్ కట్టడిలో తెలంగాణ అత్యుత్తమంగా వ్యవహరిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణను ఫాలో అవుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ముందుచూపుతో వెళుతుందని అన్నారు. ప్రతిపక్షాలకు ఏమాత్రం ఆలోచన, అవగాహన లేదని ఆయన మండిపడ్డారు. ఉత్తమ్‌ సరిహద్దుల్లో పనిచేస్తే ఏంటి? బోర్డర్‌‌లో పుణ్యానికి పనిచేశారా అని సూటిగా ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రతిపక్షాలకు ఆలోచనే లేదని దుయ్యబట్టారు. (ఆ విషయంలో ఎంతో గర్వపడుతున్నా)

కరోనా సంక్షోభ సమయంలో రైతులకు రుణమాఫీ చేసున్నామని మంత్రి తెలిపారు. కాంగ్రెస్‌ నేతలు నిజంగా జోకర్లు, బ్రోకర్లు,బఫున్లు అని తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. ఇక ప్రతిపక్షాలను గౌరవించే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లే ఎక్కువ తాగుతారని శ్రీనివాస్‌యాదవ్‌ ఎద్దేవా చేశారు. ఆదాయం కంటే తెలంగాణ ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. (షోలాపూర్‌ టు తెలంగాణ.. 68 మంది యువతులు)

అఖిలపక్షం పార్టీలు అలీ బాబా నలభై దొంగల బ్యాచ్ అని శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కేంద్రంలో దిక్కుమాలిన ప్రభుత్వం ఉందని, వలస కార్మికుల తరలింపు ఖర్చులు తెలంగాణ ప్రభుత్వం భరిస్తోందని ఆయన తెలిపారు. వలస కార్మికులకు చేయడానికి పని లేనప్పుడు రవాణా ఖర్చులు ఎలా భరిస్తారని మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ ప్రశ్నించారు. (మా ప్రభుత్వాన్ని విమర్శించే నైతికహక్కు మీకు లేదు )

మరిన్ని వార్తలు