ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు: మంత్రి తలసాని

29 Dec, 2019 02:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ర్యాలీకి అనుమతివ్వలేదనే అక్కసుతో పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌పై లేనిపోని అభాండాలు మోపడం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ దిగజారుడుతనానికి నిదర్శనమని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. ఎంపీగా వ్యవహరిస్తున్న ఉత్తమ్‌ బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరైంది కాదని, శాంతిభద్రతల పరిరక్షణలో కమిషనర్‌ సేవలు ఎనలేనివని, హైదరాబాద్‌ పోలీసులకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన అధికారిని తూలనాడడం దురదృష్టకరమన్నారు. గతంలో కాంగ్రెస్‌ నిర్వహించిన పలు కార్యక్రమాలకు అనుమతిచి్చంది కూడా ఈ అధికారే అనే విషయాన్ని ఉత్తమ్‌ మరచిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు.

పోలీసుశాఖపై లేనిపోని ఆరోపణలు చేయడం ఉత్తమ్‌ లాంటి నాయకులకు తగదని, ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టు కుని మాట్లాడితే మంచిదని తలసాని హెచ్చరించారు. అనుమతిస్తే మంచి అధికారి, అనుమతించకుంటే అవినీతి అధికారి అంటూ గగ్గోలు పెట్టడం ఆయన చౌకబారు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. క్రమశిక్షణకు మారుపేరైన ఆర్మీలో పనిచేసిన ఉత్తమ్‌.. ప్రభుత్వ అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యానించడం మంచిపద్ధతి కాదని శ్రీనివాస్‌యాదవ్‌ హితవు పలికారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో ఎన్నడు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకోసం మాట్లాడని ఉత్తమ్‌ నేడు ఎన్నికల్లో గెలవలేమనే భయంతో లేనిపోని ఆరోపణలు చేస్తూ ఎన్నికలను వాయిదా వేయాలనుకుంటున్నారని అన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రాహుల్‌కు అంత ప్రేముంటే ఇటలీ తీసుకెళ్లొచ్చు

దొంగనాటకాలు ప్రజలు గమనించాలి

నేడు సీఎంగా హేమంత్‌ ప్రమాణం

ఆర్మీ చీఫ్‌కు రాజకీయాలతో పనేంటి?

టీఆర్‌ఎస్‌ది ముస్లిం సంతుష్టీకరణే

పోలీసులు నాపై చేయి చేసుకున్నారు

ఇది రెండో నోట్ల రద్దు..!

అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగరాలి

రీషెడ్యూల్‌ చేయండి..సాధ్యం కాదు..

ఓట్ల కోసం బీజేపీ ఏమైనా చేస్తుంది: కుంతియా

పోలీసులు చేయి చేసుకున్నారు : ప్రియాంక

బీజేపీ సూచనలు పాటిస్తా : కేజ్రీవాల్‌

'కేసీఆర్‌ పాలన సామాజ్య్ర వాద శక్తులకంటే దారుణం'

ఏ ఎన్నికలైనా విజయం టీఆర్‌ఎస్‌దే: మంత్రి జగదీష్‌

ఆర్‌ఎస్‌ఎస్‌ చెడ్డీగ్యాంగ్‌ అవమానకరం: రాహుల్‌

నీ అంతు చూస్తా: సీపీపై ఉత్తమ్‌ ఫైర్‌

'స్థానికుడై ఉండి అభివృద్ధి చేయలేకపోయారు'

'తుక్డే తుక్డే గ్యాంగులో ఆ ఇద్దరు మాత్రమే'

‘నిర్మలా చాలా కమ్మగా అబద్దాలు చెబుతున్నారు’

అసలు పీకే ఎవరు.. దిమ్మతిరిగే ​కౌంటర్‌!

‘టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఆ పార్టీయే నడిపిస్తోంది’

ఏ దరికో.. ఈ పయనం..!

మీరు అంత నిప్పు, పత్తి గింజ అయితే....

‘ఆ వ్యాఖ్యలు హిందువులకు వ్యతిరేకం కాదా’

రాజకీయాల కోసం కాదు: శివకుమార్‌

‘మజ్లిస్‌ మత రాజకీయాలకు కేసీఆర్‌ వత్తాసు’

‘రాష్ట్రంలో కల్వకుంట్ల పోలీస్‌ సర్వీస్‌’

అందరూ నన్ను వాడుకొని వదిలేశారు!

పోటీ చేసే సత్తా లేకే విమర్శలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఆ విషయం గురించి దయచేసి అడగకండి’

నాకంటూ లవ్‌ స్టోరీలు లేవు: హీరోయిన్‌

స్నేహని పెళ్లి చేసుకుంటానని బన్నీ అన్నప్పుడు...

ఆలోచింపజేసే లైఫ్‌ స్టైల్‌

మా నాన్నగారు గర్వపడాలి

చిన్న బ్రేక్‌