సీఎం జగన్‌ నమ్మకాన్ని వమ్ము చేయను: వనిత

9 Jun, 2019 14:12 IST|Sakshi

సాక్షి, కొవ్వూరు : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనపై పెట్టిన బాధ్యత, నమ్మకాన్ని వమ్ము చేయనని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. అంతటి బాధ్యతలు తనకు ఇచ్చిన ముఖ్యమంత్రికి ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ఆమె కొవ్వూరులో మాట్లాడుతూ.. మహిళలకు, శిశువులకు సేవ చేసుకోవడం ఓ మహిళగా తన అదృష్టమన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి కొవ్వూరు నియోజకవర్గ నాయకులు మంత్రిని కలిసి అభినందనలు తెలిపారు.

కాగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 1999లో మినహా కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ గెలుస్తూ వచ్చింది. మరలా 20 ఏళ్ల తర్వాత టీడీపీ కోటలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి తానేటి వనిత పాగా వేశారు. గత 30 ఏళ్లలో ఏ ఎమ్మెల్యేకి దక్కని మెజార్టీని ఆమె సొంతం చేసుకున్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకూ ము గ్గురికి మంత్రి పదవులు దక్కాయి. 1978లో ఏఎం అజీజ్‌ అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందిన కేఎస్‌ జవహర్‌ ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా పనిచేశారు. మళ్లీ ఇప్పుడు తానేటి వనితకి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో మంత్రిగా స్థానం దక్కింది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా