హోంమంత్రికి మొర పెట్టుకున్నా అరణ్యరోదనే..

25 Sep, 2018 13:50 IST|Sakshi
పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటిస్తున్న కౌన్సిలర్‌ లక్ష్మి

నా భర్తపై పోలీసుల దాష్టీకం అయినా స్పందించని పెద్దలు

ఇక పదవిలో ఉండి లాభమేంటి?

రాజీనామా చేసిన పెద్దాపురం టీడీపీ కౌన్సిలర్‌ లక్ష్మి

పెద్దాపురం:  ‘నా భర్తపై ఎస్సై చేయి చేసుకున్నా న్యాయం చేయలేని పదవి ఉంటే ఎంత, ఊడితే ఎంత. ఓ వార్డు ప్రతినిధిగా ఉంటూ నా భర్తకే రక్షణ కల్పించలేని పదవి నాకొ’ద్దంటూ అధికార టీడీపీకి చెందిన కౌన్సిలర్‌ యర్రా లక్ష్మి హోంమంత్రి నిమ్మకాయ ల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తు న్న నియోజకవర్గంలోని పెద్దాపురం పురపాలక సంఘం 25వ వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్న లక్ష్మి కౌన్సిల్‌ సమావేశంలో అనూహ్యంగా పదవికి రాజీనా మా చేస్తున్నానని ప్రకటించి, రాజీనామా లేఖను చైర్మన్‌కు అందించి భర్తతో కలిసి ఇంటికి వెళ్ళిపోయారు. మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం సోమవారం  చైర్మన్‌ రాజా సూరిబాబురాజు అధ్యక్షతన జరిగింది. అందరితో పాటు వచ్చిన కౌన్సిలర్‌  లక్ష్మి తన పదవికి రాజీనామా చేస్తున్నానని సమావేశంలో ఆరంభంలోనే రాజీనామా లేఖను చైర్మన్‌కు అందజేశారు.

ఎస్సై తన భర్త  హోటల్‌ వద్దకు వెళ్ళి రాత్రివేళ చేయి చేసుకుంటే విషయాన్ని బయటకు రాకుండా అధికారంలో ఉన్న పెద్దలపై గౌరవంతో ఆగి తే ఇప్పటికీ అతనిపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం బాధాకరంగా ఉందన్నారు. హోం మంత్రి రాజప్ప దృష్టిలో ఉంచినా పోలీసులు, మేము ఒక్కటేనంటూ వారికి వత్తాసు పలికారని నిరసన వ్యక్తం చేశారు. తన భర్తపై చేయి చేసుకున్న పోలీసుల నుంచి రక్షణ లేని పదవి తనకొద్దంటూ తన భర్త శ్రీనుతో కలిసి అక్కడి నుంచి వెళ్ళి పోయారు. చైర్మన్‌ సూరిబాబురాజు స్పందిస్తూ పోలీసులను రప్పించి కౌన్సిల్‌ సభ్యుల ఎదుటే విచారించినా ఆమె రాజీనామా చేయడం బా«ధాకరమన్నారు.

నాపై అభాండాలు తగదు : ఎస్సై
కౌన్సిలర్‌ లక్ష్మి ఆరోపణపై ఎస్సై కృష్ణ భగవాన్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా తాను విధి నిర్వహణలో భాగంగానే శ్రీనుకు రాత్రి 10.30 తరువాత  హోటల్‌ ఉంచకూడదని సూచించానే తప్ప మరే విధమైన దురుద్దేశం లేదన్నారు. హోటల్‌ సమీపంలో రోడ్డు ప్రమాదాలు జరిగే జంక్షన్‌ కాబట్టి అప్రమత్తం చేసేందుకు 
 ప్రయత్నిస్తే తనపై అభాండాలు వేయడం తగదన్నారు.

మరిన్ని వార్తలు