వెలుగు చూస్తోన్న టీడీపీ డ్రామాలు..

14 Sep, 2019 16:15 IST|Sakshi

సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలనను ఓర్వలేక అభాసుపాలు చేయాలనుకున్న టీడీపీ కుటిల రాజకీయాలు బట్టబయలవుతున్నాయి. పునరావాస కేంద్రం పేరుతో చంద్రబాబు నాయుడు చేసిన జిమ్మికులు వెలుగు చూస్తున్నాయి. గుంటూరు జిల్లా పల్నాడులోని ఆత్మకూరులో జరిగిన వ్యక్తిగత సంఘటనకు రాజకీయ రంగు పులిమి టీడీపీ నాటకాలకు తెరలేపింది. పెయిడ్‌ ఆర్టిస్టులను పెట్టి  నడిపించిన టీడీపీ డ్రామాలు వెలుగు చూస్తుడటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సాక్షి టీవీ నిఘాతో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. పల్నాడు వాసులు వాస్తవాలను వెల్లడించారు. 

చదవండిపల్నాడు షో అట్టర్‌ ఫ్లాప్‌!

పెయిడ్‌ ఆర్టిస్టులతో పాటు పనిమీద వచ్చినవారితో శిబిరం ఏర్పాటు  చేయడం గమనార్హం. మంచి భోజనం,ఏసీ రూముల్లో నిద్రపోవచ్చనే ఉద్దేశంతో కొందరు అమాయకులు శిబిరానికి వెళ్ళారని తెలుస్తోంది. అలాగే బస్సు దొరకని ప్రయాణీకులకు కూడా శిబిరంలో బస ఏర్పాటు చేశారు. శిబిరం దగ్గర ఏం జరుగుతుందో చూద్దామని వెళ్లిన వారినీ కూడా టీడీపీ నేతలు శిబిరం లోపలికి పంపించారు. బియ్యం అమ్ముకున్నారనే ఆరోపణలతో రేషన్ డీలర్ షిప్ రద్దయిన డీలర్లకు కూడా  బస కల్పించారు. అలాగే ఆస్పత్రిలో వైద్యం కోసం వచ్చిన కొంతమంది రాత్రి  శిబిరంలో నిద్రపోయారు. ఏసీ రూముల్లో బాగా నిద్ర పట్టిందని బాధితులు చెబుతున్నారు. టీడీపీ నాటకానికి ఆత్మకూరు గ్రామస్తులు సహకరించకపోవడంతో కంగుతున్న టీడీపీ..పెయిడ్‌ ఆర్టిస్టులు, అమాయకులతో డ్రామాను రక్తి కట్టించాలని ప్రయత్నాలు చేసింది. చివరకు వాస్తవాలు బయటకు రావడంతో టీడీపీ అభాసుపాలైంది. 

చదవండి: ఆత్మకూరులో అసలేం జరిగింది?

మరిన్ని వార్తలు