టీడీపీ నేతల గుండెల్లో  ‘ఆగస్టు’ గండం

2 Aug, 2019 12:58 IST|Sakshi

టీడీపీలో టెన్షన్ మొదలయ్యింది.. 

ఆగస్టు పేరు చెప్తేనే తెలుగుదేశం నేతల గుండెల్లో రైళ్లు 

ఆగస్టు సంక్షోభాలే ఈ భయాలకు మూలం 

సాక్షి, అమరావతి: ఆగస్టు ఈ పేరు చెబితేనే తెలుగుదేశం నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దీంతో ఆగస్ట్‌ నెల పేరు చెప్తే.. తెలుగుదేశం పార్టీ నాయకులు బేజారు. తెలుగుదేశం పార్టీలో సంభవించిన కీలక పరిణామాలకు ఆగస్టు నెలకు ఉన్న సంబంధమే ఈ భయానికి కారణం. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారం కోల్పోయిన తరువాత వరుసగా పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు టీడీపీలో మరో ఆగస్టు సంక్షోభం తప్పదనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇటీవలి ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దెబ్బకు దారుణమైన ఓటమిని టీడీపీ చవి చూసింది.

తెలుగుదేశంలోనే ఉంటే భవిష్యత్ ఉండదని తెలిసి ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులైన సుజన చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు టీడీపీకి బీజేపీలో చేశారు. ఏకంగా టీడీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేశారు. తరువాత అన్నం సతీష్ ప్రభాకర్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బీజేపీ తీర్దం పుచ్చుకున్నారు. అనంతరం మరికొందరు ముఖ్యమైన టీడీపీ నేతలు బీజేపీలో చేరారు. మరోవైపు త్వరలోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కీలక నేతలు కూడా టీడీపీ నుంచి తమ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని బీజేపీ నేతలు బహిరంగంగానే చెపుతున్నారు. 

ఈ ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణాలు చోటు చేసుకుంటాయని కమలం పార్టీ నేతలు చెబుతున్న మాటలు ఎటుదారితీస్తాయో అని టీడీపీ ఆందోళనగా ఉంది. రాజ్యసభలో టీడీపీ పక్షాన్ని వీలినం చేసిట్లు ఏపీలో కూడ టీడీపీ శాసన సభ పక్షాన్ని బీజేపీలో వీలీనం చేసే దిశగా కూడా కొంత మంది టీడీపీ ప్రజా ప్రతినిధులు పావులు  కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.. దీనికి తోడు ఆగస్టు 11  తరువాత రాష్ర్టంలో కీలక పరిణామాలు తప్పవని బీజేపీ నేతలు చేస్తున్న హెచ్చరికలు టీడీపీని కుదిపేస్తున్నాయి. 

మరిన్ని వార్తలు