బ్యాంక్‌ దళిత అధికారిణిపై టీడీపీ నేత వీరంగం

12 May, 2018 12:20 IST|Sakshi

బూతుపురాణంతో తిట్టిన వైనం

కర్రతో దాడికి యత్నం

నెల్లూరు: అధికార పార్టీ మదంతో కావలికి చెందిన ఓ టీడీపీ నేత కో ఆపరేటివ్‌ బ్యాంక్‌లో పనిచేసే అసిస్టెంట్‌ మేనేజర్‌ స్థాయి దళిత అధికారిణిపై వీరంగం చేశాడు. మహిళ అనే విచక్షణ మరిచి పత్రికల్లో రాయలేని బూతు పురాణంతో దూషించాడు. ఈ ఘటన పట్టణంలోని జనతాపేటలో ‘నెల్లూరు జిల్లా కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌’ శాఖలో శుక్రవారం జరి గింది. సహచర ఉద్యోగుల సమక్షంలో సదరు నేత చేసిన వీరంగానికి అవమానం భారంతో కుంగిపోయిన ఆమె విలపిస్తూ కావలి రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ బీద మస్తాన్‌రావు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్రకు సన్నిహితుడైన టీడీపీనేత అల్లంపాటి పార్థసారథిరెడ్డి అత్యంత సన్నిహితుడు. పార్థసారథిరెడ్డి శుక్రవారం తన వ్యక్తిగత ఖాతాలో రూ.58 వేల నగదు జమ చేసి, డీడీ ఇవ్వాలని సిబ్బందిని అడిగాడు. క్యాషియర్‌ పాన్‌కార్డు ఇవ్వమని అడిగారు. తాను మళ్లీ ఇస్తానని చెప్పడంతో, క్యాషి యర్‌ నిబంధనలు అంగీకరిచవన్నారు.

ఆయన క్యాషియతో వాగ్వాదానికి దిగడంతో పక్కనే ఉన్న అసిస్టెంట్‌ మేనేజర్‌ దృష్టి తీసుకెళ్లారు. పాన్‌కార్డు తప్పనిసరిగా ఉండాలని ఆమె చెప్పడంతో,  పార్థసారథిరెడ్డి రెచ్చిపోయి వీరంగం సృష్టించాడు. విచక్షణ కోల్పోయి మహిళా అధి కారిణి అని కూడా పత్రికలో రాయడానికి వీలు కాని భాషలో ఆమెను దూషించాడు. బ్యాంక్‌లో టేబుల్‌పై  పైళ్లలోని కాగితాలు గాలికి ఎగరకుం డా చేసేందుకు ఉపయోగించే బలంగా ఉండే పొడవాటి కర్రను తీసుకుని ఆమెపై దాడి చేయబోయాడు. కాగితాలను గుదిగుచ్చి పెట్టే స్టాండ్‌ ను ఆమెపైకి విసిరాడు. బ్యాంక్‌లో వీరంగం చేస్తున్న పార్థసారథిరెడ్డిని అడ్డుకోబోయిన ఇతర సిబ్బందిని తోసేశాడు. తాను ఎవర్నో తెలుసా అంటూ హెచ్చరిం చాడు. బ్యాంక్‌లో విధి నిర్వహణలో ఉన్న అసిస్టెంట్‌ మేనేజర్‌ స్థాయి దళిత అధికారిణితో జుగుప్సాకరంగా ప్రవర్తించి హెచ్చరించడంతో బ్యాంక్‌లో పనిచేసే వారు భయభ్రాంతులకు గురయ్యారు. బాధితురాలు రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసిందని సీఐ జీఎల్‌ శ్రీనివాసరావు ధృవీకరించారు.

రంగంలోకి టీడీపీ నాయకులు
ఇది ఇలా ఉండగా అధికార టీడీపీలో పెత్తనం చేస్తున్న బీద సోదరులకు సన్నిహితుడైన అల్లంపాటి పార్థసారథిరెడ్డిని ఈ వీరంగం కేసు నుంచి తప్పించడానికి టీడీపీ నాయకులు రంగ ప్రవేశం చేశారు. కనీసం కేసును అవకాశం ఉన్నంత వరకు నీరు గార్చి చాలా స్వల్ప కేసుగా చేయాలని పోలీసులపై వత్తిళ్లు మొదలు పెట్టారు. పోలీసులు బ్యాంక్‌లోని సీసీ కెమెరాలో రికార్డు అయిన వీడియో ఫుటేజీని పరిశీలించి, టీడీపీ నేత అల్లంపాటి పార్థసారథిరెడ్డి వీరంగంపై విస్తుపోయారు. 

మరిన్ని వార్తలు