ఎలక్షన్‌ అయిపోనీ..  మీ అంతుచూస్తా!

5 Apr, 2019 03:02 IST|Sakshi

ఎంతరా.. మీ బ్రతుకులు? ∙మీ నాయన ఎట్లా బ్రతుకుతాడో చూస్తా

తలలేస్తుంది.. లం...కొడుకుల్లారా..  

బరితెగించిన మైదుకూరు టీడీపీ అభ్యర్థి ‘పుట్టా’ తనయుడు మహేష్‌

వైఎస్సార్‌సీపీలో చేరిన నేతపై బూతు పురాణం

సాక్షి ప్రతినిధి కడప : ‘ఎంతరా.. మీ బ్రతుకులు.. ఎలెక్షన్‌ అయిపోనీ మీ అంతుచూస్తా. కొడుకుల్లారా మీ నాయన ఎట్లా బ్రతుకుతాడో చూడు. తలలేస్తుంది. మా వద్ద పనులు చేయించుకుని పార్టీ మారుతారా.. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. ఎట్లా బ్రతుకుతారో చూస్తా. లం..కొడుకుల్లారా’.. అంటూ వైఎస్సార్‌ జిల్లా మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్‌ తనయుడు మహేష్‌ యాదవ్‌ స్థానిక వైఎస్సార్‌సీపీ నేతపై రెచ్చిపోయారు. బి.మఠం మండల నాయకుడు మేకల రత్నకుమార్‌ యాదవ్‌ కుమారుడు బాలకృష్ణ యాదవ్‌కు గురువారం సా.3.30 గంటలకు 91004 92938 ఫోన్‌ నంబర్‌ నుంచి కాల్‌ వచ్చింది. ఫోన్‌ లిఫ్ట్‌చేసి హాలో అంటుండగానే.. ‘ఎంతరా.. మీ బ్రతుకులు, ఎలెక్షన్‌ అయిపోనీ మీ అంతుచూస్తా.. మీ నాయన ఎట్లా బ్రతుకుతాడో చూస్తా, తలలేస్తుంది.. కొడుకుల్లారా’.. అంటూ తిట్లదండకం అందుకున్నారు. ఎవ్వరూ మాట్లాడేది, మర్యాదగా మాట్లాడండంటూ బాలకృష్ణయాదవ్‌ చెబుతున్నప్పటికీ మరింత రెచ్చిపోయినా మహేష్‌.. ‘ఐదేళ్లు మా వద్ద పనులు చేయించుకుని పార్టీ మారుతార్రా.. వచ్చేదీ తెలుగుదేశం ప్రభుత్వమే. కొడుకుల్లారా తిన్నదంతా కక్కిస్తా. ఎలా బ్రతుకుతారో చూస్తా. లం..కొడుకుల్లారా’.. అంటూ అసభ్య పదజాలంతో నోటికొచ్చినట్లు బండ బూతులు మాట్లాడారు. ఇందుకు బాలకృష్ణ స్పందిస్తూ.. ‘రేయ్‌ మర్యాదగా మాట్లాడు అనగానే, ‘బోసుడికే చెప్పేది వినూ.. మీ నాన్న తిన్న డబ్బుంతా కక్కిస్తా. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే. మీరు యాదవ్‌కు పుట్టారా.. రెడ్డికి పుట్టారా.. లం.. కొడుకుల్లారా ఉండండీ’.. అంటూ ఫోన్‌ కట్‌ చేశాడు.

వాట్సాప్‌ గ్రూపుల్లో హల్‌చల్‌
మహేష్‌యాదవ్‌ బూతు పురాణం వ్యవహారం సాయంత్రం నుంచి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. బాలకృష్ణ ఇటీవల వైఎస్సార్‌సీపీలో చేరినందునే మహేష్‌యాదవ్‌ అధికారం అండతో నోటికొచ్చినట్లు మాట్లాడి తన అక్కసు తీర్చుకున్నట్లు తెలుస్తోంది. పైగా సామాజికవర్గాలను ప్రస్తావిస్తూ, ఎవ్వరికీ పుట్టారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. 

బీసీని కావడంవల్లే: మేకల రత్నకుమార్‌
తాము బీసీ కావడంవల్లే మహేష్‌ తన కుమారుడికి ఫోన్‌చేసి నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడారని మేకల రత్నకుమార్‌ యాదవ్‌ తెలిపారు. తనతో పాటు ఎంతోమంది పార్టీ మారిన వారున్నారని.. మమ్మల్ని మాత్రమే టార్గెట్‌ చేయడానికి కారణం వెనుకబడిన వర్గాలకు చెందిన వారం కావడమేనని ఆయన వాపోయారు. టీడీపీ బి.మఠం మండల కన్వీనర్‌గా ఉన్న తాను 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన పుట్టా సుధాకర్‌యాదవ్‌ కోసం ఎంతో కృషిచేశానన్నారు. పార్టీలో నియంతృత్వ పోకడలు, ఏకపక్ష నిర్ణయాలు, విచ్చలవిడి అవినీతి కారణంగానే తాను వైఎస్సార్‌సీపీలో చేరానన్నారు. ‘నాకిష్టమొచ్చిన పార్టీకి మద్దతిస్తానని.. అంతమాత్రానా నన్ను నా కుటుంబాన్ని దూషిస్తారా’ అని రత్నకుమార్‌ వాపోయారు.   

మరిన్ని వార్తలు