గుడివాడలో టీడీపీ నాయకుల బరితెగింపు

4 Apr, 2019 21:44 IST|Sakshi

సాక్షి, గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ జోరుగా ప్రలోభాలకు తెరదీశారు. గుడివాడలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు కొనుగోలు చేస్తూ తెలుగు తమ్ముళ్లు అడ్డంగా దొరికిపోయారు. గుడివాడ మున్సిపాలిటీలో శానిటరీ వర్కర్స్‌ను ఎన్నికల విధుల కోసం ఇతర ప్రాంతాలకు నియమించటంతో వారికి ఎలక్షన్‌ కమిషన్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించింది. ఇదే అదనుగా భావించిన టీడీపీ నాయకులు ఒక్కొక్క పోస్టల్‌ బ్యాలెట్‌కు రూ.2500 ఇస్తూ కెమెరాకు చిక్కారు. 200 మందికి పైగా మున్సిపల్‌ ఉద్యోగుల వద్ద నుంచి పోస్టల్‌ బ్యాలెట్లను తెలుగు తమ్ముళ్లు తీసుకున్నారు.

ఆధోనిలోనూ పోస్టల్‌ ఓట్ల కొనుగోలు
మరో వైపు కర్నూలు జిల్లాలో కూడా టీడీపీ నేతల ప్రలోభాలు ఎక్కువయ్యాయి. కర్నూలు జిల్లా ఆధోని నియోజకవర్గంలో ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్లు లాక్కుని దౌర్జన్యంగా టీడీపీ నేతలు ఓట్లేస్తున్నారు. ఈ విషయం తెలిసి వైఎస్సార్‌సీపీ నేతలు రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరపాల్సిన అధికార పార్టీ, ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసిందని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ నేతలు చేసిన ఫిర్యాదును కూడా రిటర్నింగ్‌ అధికారి పట్టించుకోకపోవడంతో యువనేత జైమనోజ్‌ రెడ్డి వాగ్వాదానికి దిగారు. కళ్ల ముందు అన్యాయం జరుగుతున్నా రిటర్నింగ్‌ అధికారి పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు.

మరిన్ని వార్తలు