గుంటూరులో టీడీపీ Vs బీజేపీ

5 Jan, 2018 15:28 IST|Sakshi

సాక్షి, విజయనగరం: చంద్రబాబు ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమం ప్రారంభించింది ప్రతిపక్ష నేతలను, కార్యకర్తలను తిట్టడానికో.. కుదిరితే కొట్టడానికో అన్నట్లు ఉంది. కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ప్రతిపక్షనేతలను సభలకు పిలవడం.. ప్రసంగాన్ని అడ్డుకోవడం తంతుగా మారింది. తాజాగా విజయనగరం జిల్లాలో తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చిపోయారు. డెంకాడ మండలం మోదవలసలో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. జన్మభూమి కార్యక్రమంలో తమ సమస్యలను చెప్పుకోవడానికి వచ్చిన వారిపై విచక్షణారహితంగా పిడిగుద్దులు కురిపించారు. ఈ సంఘటనలో ఇద్దరు కార్యకర్తలకు తీవ్రగాయాలయ్యాయి. బాధితులను ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా టీడీపీ నేతలు మరోసారి డాడులకు దిగారు.

గుంటూరు జిల్లాలో బీజేపీ Vs టీడీపీ
గుంటూరు జిల్లా, వల్లూరివారితోటలో జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. సభవేదికపై ఉన్న ఫ్లెక్సీలో ప్రధాని మోదీ బొమ్మ పెట్టలేదని బీజేపీ నేతలు, కార్యకర్తలు సభను అడ్డుకున్నారు. కేంద్ర నిధులతో మీరు ప్రచారం చేసుకుంటారా అంటూ ఎమ్మెల్యే మోదుగులను బీజేపీ కార్యకర్తలు నిలదీశారు. అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదంటూ తెలుగుదేశం కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలపై ఎదురుదాడికి దిగారు. దీనిపై స్పందించిన బీజేపీ నాయకులు చంద్రబాబే ప్రత్యేక పాకేజీ తీసుకొని హోదా అడగటం లేదన్నారు. దీంతో ఇరుపార్టీల నేతలు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

మరిన్ని వార్తలు