‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ విడుదల ఆపాలి

14 Mar, 2019 20:28 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాని నిలిపివేయాలని కోరుతూ టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, సాధినేని యామిని, గౌతు శిరిషా, సతీష్‌లు ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేదికి కలిసి సినిమా విడుదలను ఆపాలని కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రను నెగెటివ్‌గా చూపించారన్నారు.
(‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ పై ఈసీకి ఫిర్యాదు)
ఎన్నికల వేళ ఓటర్లపై ఈ సినిమా ప్రభావం చూపుతుందని అభ్యంతరం తెలిపారు. చంద్రబాబు ప్రతిష్టతను దిగజార్చేలా సినిమా ట్రైలర్‌ ఉందన్నారు. ఎన్నికలల్లో చంద్రబాబును దెబ్బతీసేలా ఉన్న ఈ సినిమా విడుదలను ఆపాలని డిమాండ్‌ చేశారు. రామ్‌గోపాల్‌ వర్మ విడుదల చేసిన ట్రైలర్‌ వీడియోని సీఈఓకి ఇచ్చామని, ఆయన పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు.

రామ్‌ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ఎన్నో వివాదాలు కేంద్ర బిందువైంది. వర్మ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న సమయానికి వెనక్కి తగ్గేది లేదంటూ మార్చి 22న విడుదల అని ప్రకటించేశాడు. తాజాగా టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదుపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

చదవండి : టీడీపీ ఫిర్యాదుపై స్పందించిన లక్ష్మీ పార్వతి

మరిన్ని వార్తలు