ఓటమి జీర్ణించుకోలేక టీడీపీ నేతల నిర్వాకం

5 Jun, 2019 13:08 IST|Sakshi
భాస్కరరావుపై విరుచుకుపడుతున్న టీడీపీ నాయకుడు

సీతానగరం (రాజానగరం): ఓటమిపాలైనా జీర్ణించుకోలేక దాడులకు తెగబడుతున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఓట్లు అడిగిన ప్రతిపక్ష నాయకులతో ఘర్షణలకు దిగుతూ  ‘మా ప్రాంతంలో ఓట్లు అడగడానికి మీకు సంబంధం ఏమిటి’ అంటూ వారు నిలదీస్తున్నారు. వివరాల్లోకి వెళితే సీతానగరం మండలం నాగంపల్లి పంచాయతీ పరిధిలోని అచ్చయ్యపాలెంలో అతిరాస కులస్తులు అధికంగా ఉన్నారు. అదే కులానికి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంకు చెందిన వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అతిరాస అభ్యుదయ సంఘం అధ్యక్షుడు ఇళ్ల భాస్కరరావు ఎన్నికల సమయంలో తమ అతిరాస కులస్తులను కలిసి వైఎస్సార్‌ సీపీ కి ఓట్లు వేయాలని అడిగారు. టీడీపీ ఇక్కడ ఓటమి పాలైంది.

నాగంపల్లి పంచాయతీ మాజీ తాజా సర్పంచి అడపా గణేష్‌ సోమవారం అచ్చయ్యపాలెంలో అతిరాస కులస్తుల ఇంటిలో జరిగిన ఫంక్షన్‌కు హాజరైన భాస్కరరావుపై విరుచుకుపడ్డారు. ‘ఎక్కడ నుంచో వచ్చి ఇక్కడ ఓట్లు అడగడానికి నువ్వు ఎవరు? ఎందుకు వచ్చి ఓట్లు అడిగావు? ఏ అధికారం ఉందని ఇక్కడకు వచ్చావు’ అని తీవ్ర పదజాలంలో విరుచుకుపడ్డారు. దాంతో భాస్కరరావు వైఎస్సార్‌ హయాంలో తన అభ్యర్థన మేరకే అతిరాస కులస్తులను బీసీల్లోకి చేర్చారని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ అతిరాస కులస్తులు ఉన్నా ఓటు అడిగే హక్కు తనకు ఉందన్నారు. ‘ఎక్కడో ఉన్న వారు వచ్చి మీ తరఫున ఎంపీలుగా పోటీ చేశారని, నేను మా కులస్తులను ఓటు అడిగితే మీకేంటి అభ్యంతరం’ అని నిలదీశారు. దాంతో  వాగ్వీవాదం తీవ్రమైంది. స్థానికులు టీడీపీ నాయకులకు సర్ది చెప్పారు. టీడీపీ నాయకులు ఇంకా పాతపోకడలను వదలలేకపోతున్నారని,  ఇది సరైన విధానం కాదని పలువురు వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా