తెలంగాణలో ప్రలోభాలకు తెరతీసిన టీడీపీ

2 Dec, 2018 20:35 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: తెలంగాణలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనుండగా టీడీపీ ధన ప్రలోభాలకు తెరతీసింది. ఖమ్మం మహాకూటమి అభ్యర్థి తరఫున ఓటుకు నోటు స్కీంతో టీడీపీ శ్రేణులు రంగంలో దిగాయి. వారు ఇందుకోసం సరికొత్త విధానాన్ని ఎంచుకున్నారు. అందులో భాగంగా జనాలకు ఓటరు స్లిప్‌తో పాటు 10 రూపాయల నోటు జతచేసి అందజేస్తున్నారు. ఆ నోట్‌ తిరిగి ఇస్తే రెండువేల రూపాయలు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. ఓటర్‌ స్లిప్‌తో పాటు అందజేసే 10 రూపాయల నోట్‌పై ప్రత్యేక నంబర్‌ సిరీస్‌తో ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా ప్రలోభాలకు పాల్పడుతున్న మహాకూటమి శ్రేణులను టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీనిపై సాక్ష్యాధారాలతో టీఆర్‌ఎస్‌ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఖమ్మం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పువ్వాడ అజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. మహాకూటమి అభ్యర్థుల ప్రలోభాలను అడ్డుకుని తీరుతామని తెలిపారు. ప్రజా బలంతో గెలవడానికి ప్రయత్నించాలని మహాకూటమి అభ్యర్థులకు సూచించారు. నంద్యాలలో మాదిరి ఇక్కడ రాజకీయాలు చేస్తే సహించేది లేదన్నారు.

మరిన్ని వార్తలు