వైఎస్సార్‌సీపీలోకి ఉల్చాల టీడీపీ నాయకులు

13 Jan, 2020 10:22 IST|Sakshi
ఎమ్మెల్యే సుధాకర్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరుతున్న ఉల్చాలకు చెందిన టీడీపీ నాయకులు

కర్నూలు రూరల్‌: టీడీపీ నాయకులైన ఎదురూరు విష్ణువర్ధన్‌ రెడ్డి,  కొత్తకోట ప్రకాశ్‌ రెడ్డికి వారి అనుచరులు ఝలక్‌ ఇచ్చారు. ఉల్చాల గ్రామానికి చెందిన  దాదాపు 100 మంది ఆదివారం..కర్నూలులో కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా కర్నూలు మండల తెలుగు యువత అధ్యక్షుడు వెంకటేశ్, ఉల్చాల మాజీ ఉప సర్పంచ్‌ నాగరాజు, మాజీ సర్పంచ్‌ ఇసాక్‌ మాట్లాడారు. వైఎస్సార్‌సీపీకి గ్రామాల్లో ఆదరణ పెరిగిపోతోందన్నారు. కోడుమూరు నియోజకవర్గంలో ఎదురూరు విష్ణువర్ధన్‌ రెడ్డి, కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి..అవినీతి తారాస్థాయికి చేరందన్నారు. పూడూరు–పడిదెంపాడు రోడ్డు నిర్మాణానికి  2018లో రూ.15కోట్ల నిధులు విడుదల అయితే.. వాటాలు కుదరక పనిని వీరిద్దరూ ఆక్కడే ఆపేశారని విమర్శించారు. సుంకేసులలో ఏపీ టూరిజం హోటల్‌  నిర్మాణానికి మొదటి దశగా రూ.2కోట్లు అప్పట్లో విడుదల చేయడానికి ప్రతిపాదనలు పంపిస్తే.. ఆ పనులు ప్రతిపాదనలకే పరిమితం చేశారని ఆరోపించారు.

రేమట–సుంకేసుల రోడ్డు నిర్మాణంలో మామూళ్లు తీసుకున్నారని, రేమట ఎత్తిపోతల పథకంలో ఆయకట్టు రైతులతో ఇష్టానుసారంగా ఎకరానికి రూ.వేలల్లో వసూలు చేశారన్నారు. విష్ణు, కొత్తకోట..అరాచకాలు భరించలేక వైఎస్సార్‌సీపీలో చేరామన్నారు. అనంతరం కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌ మాట్లాడుతూ.. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను అన్ని గ్రామాల్లో గెలిపిస్తామన్నారు. విష్ణు, కొత్తకోట అరాచకాలకు అంతులేకుండా పోయిందని, గతంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలపై ఇష్టానుసారంగా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారన్నారు. వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన వారిలో టీడీపీ నాయకులు వై.కుశలన్న, గ్రామ నాయకులు బి.వెంకట్రాముడు, ఎస్‌.షఫీబాష, మాల హనుమంతు, హరిజన లచ్చప్ప, మధు, ఎరుకల వెంకటస్వామి, బి.నగేశ్,ఎస్‌.మహబూబ్‌బాష, బి.రాఘవేంద్ర, బి.రాముడు, బడేసాబ్, రామకృష్ణ, శివ, పురుషోత్తం ఉన్నారు. టీడీపీ నాయకులతో పాటు వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు శ్యాంరెడ్డి, తిరుమల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు