కమలం వైపు.. టీడీపీ మిడతల దండు!

6 Jul, 2020 10:35 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏమీ తినడానికి దొరకని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) మిడతల దండు కమలం పువ్వు వైపు కదులుతోందని వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి సోమవారం ట్వీట్​ చేశారు. ఇప్పటికే కొన్ని మిడతలు బీజేపీలో చేరి విధ్వంసం సృష్టిస్తున్నాయన్నాయని గ్రహించేలోగానే, మిగతావి ఎగురుకుంటూ బయల్దేరాయని చెప్పారు. ఈ విపత్తు నుంచి బీజేపీ ఎలా గట్టెక్కుతుందో ముందు ముందు చూడాలన్నారు. (పాజిటివ్‌ ఉన్నా లక్షణాల్లేవా!)

అవసరాల కోసం స్వార్థంతో జెండాలు మార్చేవారంతా లిటిగేటర్ల అవతారం ఎత్తుతున్నారని విమర్శించారు. ప్రజాతీర్పును అపహాస్యం చేయాలని చూస్తే ఏ వ్యవస్థా ఉపేక్షించదని హెచ్చరించారు. మీడియా ఎంటర్​టైనర్లుగా మిగలడం మినహా సాధించేది ఏముండదని తెలిపారు. పతనమైన విలువలకు ప్రాణం పోసే యత్నం చేస్తున్న ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డిని ఈ శక్తులేవీ అడ్డుకోలేవని స్పష్టం చేశారు. (మిలియన్‌ మార్క్‌)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు