తెలుగు తమ్ముళ్లకు ఇంత వణుకా?

13 Mar, 2019 12:53 IST|Sakshi

ప్రభుత్వ కార్యాలయ్యాల్లో వైస్సార్‌సీపీ గుర్తు ఫ్యాన్‌ను తొలిగించాలని విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌ : ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డినే కాదు.. ఆయన పార్టీ గుర్తు సీలింగ్‌ ఫ్యాన్‌ను చూస్తేనే పచ్చ తమ్ముళ్లకు వణుకుపుడుతోంది. ప్రతిపక్షనేత చేపట్టిన పాదయాత్రతో జగన్‌ కావాలి.. జగన్‌ రావాలని ప్రజలు విశ్వసిస్తుండటంతో రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు ఒక్కొక్కరూ.. వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకొని జగన్‌దే అధికారమని జోస్యం చెప్పుతున్నారు. దీంతో పచ్చ తమ్ముళ్ల వెన్నులో వణుకు మొదలైంది. ఓటమి భయంతో వారిలో తీవ్ర అసహనం మొదలైంది. ఈ ఫ్రస్టేషన్‌లో తాము ఏం చేస్తున్నామో కూడా తెలియని స్థితిలోకి వెళ్లిపోయారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తు అయిన సీలింగ్‌ ఫ్యాన్‌లను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తొలిగించాలని తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.

గవర్నమెంట్ ఆఫీసుల్లో ఫ్యాన్లు ఉండటం వల్ల ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశం ఉందని, వెంటనే ఫ్యాన్లను తొలగించాలని కొందరు టీడీపీ నేతలు తహసీల్దార్ జనార్దన్ శెట్టిని కోరారు. ఎన్నికల కోడ్‌ను ఫ్యాన్ల తొలగింపునకు కూడా అన్వయించాలన్నారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పంలో ఈ ఘటన జరగడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఫిర్యాదు లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఎలక్షన్ కోడ్ అంటే ఏంటో అనుకున్నా. గాజు గ్లాసులో టీ తాగకూడదు.. రోడ్డు మీద సెకిలెక్కి తిరగకూడదు.. ప్రభుత్వ అధికారులు చేతిని తీసేసుకోవాలి.. అని కూడా ఫిర్యాదు చేస్తారేమో.. మరీ ఇంత అసహనమా.. అభద్రతా భావమా?.. ఇదెక్కడి ఫిర్యాదురా నాయనా?’  అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 

ఇక తమ్ముళ్లే కాదు.. వారి అధినేత చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా కూడా అసహనంతో రగిలిపోతుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏం చేయాలో తెలియక ప్రతిపక్షనేతపై మళ్లీ అదే విషప్రచారాన్ని అందుకుంది. గత ఎన్నికల్లోనూ ఇదే ప్రచారంతో గట్టెక్కి అధికారం చేపట్టి అవినీతి పాలనతో ప్రజా వ్యతిరేకతను పెంచుకున్న పంచ్చపార్టీ.. ఏం చెప్పాలో తెలియక మళ్లీ అదే రాగాన్ని అందుకుంది. ఎంత సేపు చంద్రబాబుకు ఆయన అనుకూల మీడియాకు ప్రతిపక్షనేతపై ఏడ్వడం తప్పా.. తామేం చేశామో.. చెప్పి ఎన్నికలకు వెళ్లే సత్తా లేదని నెటిజన్లు ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు.

 

మరిన్ని వార్తలు