డబ్బులు పంచుతూ పట్టుబడ్డ టీడీపీ ఎమ్మెల్యే

10 Apr, 2019 20:50 IST|Sakshi
టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్‌(పాత చిత్రం)

శ్రీకాకుళం: కవిటిలో ఓటర్లకు డబ్బులు పంచుతూ ఇచ్చాఫురం టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ వీడియోకు చిక్కారు. ఈ తతంగాన్ని వీడియో తీసిన యువకులను ఎమ్మెల్యే అనుచరులు చితకబాదారు. ఈ ఘటనలో మణిసంతోష్‌, ప్రశాంత్‌, రేవతీపతి, మిన్నారావు, దశరథ అనే యువకులకు గాయాలు అయ్యాయి.  ఫిర్యాదు చేయడానికి వెళ్లిన యువకులను పోలీసులే బెదిరించడంతో అవాక్కవడం వారివంతైంది. ఫిర్యాదు ఉపసంహరించుకోవాలని యువకులను పోలీసులు తీవ్రంగా వేధిస్తున్నారు. పోలీసుల తీరుపై యువకుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు