టీడీపీ ఎమ్మెల్యే.. స్మగ్లర్లకు డాన్‌

11 Aug, 2018 09:44 IST|Sakshi
వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నేత బొల్లా బ్రహ్మనాయుడు

వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులుపై వైఎస్సార్‌సీపీ నేత మండిపాటు

సాక్షి, గుంటూరు: వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే ఆంజనేయులు స్మగ్లింగ్ చేసి డబ్బులు సంపాదించారని, ఆయన స్మగ్లర్లకే డాన్‌ అని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ వినుకొండ నేత బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. హత్యా రాజకీయాలు, శవరాజకీయాలు చేసే చరిత్ర ఆంజనేయులుదేనని మండిపడ్డారు. వ్యాపారంలో సొంత భాగస్వామిని హత్య చేయించిన వ్యక్తి ఆంజనేయులు అని అన్నారు. భాగస్వామి భార్యను బెదిరించి.. వారి ఆస్తులన్నీ బలవంతంగా ఆంనేయులు లాక్కున్నారని అన్నారు. 

ఆంజనేయులు వేలకోట్ల రూపాయలు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తనపై హత్య కేసు బనాయించడానికి ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని, ఈ మేరకు పోలీసులపై ఆయన తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. పోలీసులు పక్షపాతం లేకుండా ఈ కేసును విచారిస్తే వాస్తవం ఏమిటో తెలుస్తుందన్నారు. ఎమ్మెల్యే ఆంజనేయులు ముగ్గురిని చంపినట్టు వినుకొండలో ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో  వినుకొండలో వైఎస్సార్‌సీపీ గెలుస్తుందని అన్నారు.
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు