లేఖలతో ఆ పని సాధ్యం కాదు : అసెంబ్లీ అధికారులు

26 Jan, 2020 19:31 IST|Sakshi

సెలెక్ట్‌ కమిటీపై ఎలాంటి ‍ ప్రక్రియ చేపట్టలేదన్న అధికారులు

సాక్షి, విజయవాడ: టీడీపీ నేతల బరితెగింపు యవ్వారాలు మరింత పెరిగాయి. ఇప్పటికే పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో అడ్డుకున్న పచ్చ పార్టీ తాజాగా సెలెక్ట్‌ కమిటీ పేరుతో తప్పుడు ప్రచారానికి తెరతీసింది. శాసన మండలి చైర్మన్‌ అన్ని పార్టీలకు సెలెక్ట్‌ కమిటీ విషయమై లేఖలు రాశారంటూ అనుకూల మీడియాకు అసత్యపు లీకులు విడుదల చేస్తున్నారు. దీంతో చైర్మన్ లేఖల పేరుతో ఎల్లో మీడియాలో టీడీపీ విషప్రచారానికి పూనుకుంది. 

కాగా, ఈ విషయమై పలు రాజకీయ పార్టీలను వివరణ కోరగా.. తమకు మండలి చైర్మన్‌ నుంచి ఎటువంటి లేఖలు అందలేదని చెప్తున్నారు. మరోవైపు టీడీపీ నేతల వద్ద చైర్మన్‌ లేఖల అంశాన్ని ప్రస్తావించగా  ముఖం చాటేస్తున్నారు. ఇక సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి ప్రక్రియ చేపట్టలేదని అసెంబ్లీ అధికారులు ధ్రువీకరించారు. అదేవిధంగా సెలెక్ట్‌ కమిటీపై ఎటువంటి బులెటిన్‌ విడుదల చేయలేదని పేర్కొన్నారు. లేఖలతో సెలెక్ట్‌ కమిటీ  ఏర్పాటు సాధ్యం కాదని వారు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు