ఒకే ఒక్కడిపై ఎందుకంత అక్కసు!

8 Sep, 2019 08:08 IST|Sakshi

100 రోజుల సువర్ణపాలనపై  ఓర్వలేనితనం

అడ్రసు గల్లంతవుతుందన్న  భయం

మాట నిలబెట్టుకున్న  వైఎస్‌ జగన్‌పై దుష్ప్రచారం

చంద్రబాబు కార్యక్రమాలను కొనసాగిస్తే చాలంటున్న అచ్చెన్న 

అసత్య ప్రచారంపై ప్రజాగ్రహం

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు జిల్లాలో 26 పర్యాయాలు పర్యటించారు. అంతకుముందు ఎన్నికల ప్రచారానికి వచ్చారు. లెక్కలేనన్ని హామీలు ఇచ్చారు. కానీ ఐదేళ్లలో ఒక్కటి కూడా పూర్తిగా నిలబెట్టుకోలేదు. అదే వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే చాలావరకు హామీలు నెరవేర్చారు. తక్కువ కాలంలోనే పరి ష్కారం చూపిన ఒకే ఒక్కడిగా పేరు తెచ్చుకున్నారు. ఇచ్చిన మాటను ని లబెట్టుకున్నారని జిల్లా ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంటే... త మ అడ్రసు గల్లంతవుతుందనే భ యమో ఏమో గాని ఐదేళ్లు మంత్రిగా వెలగబెట్టి జిల్లాకు ఏమీ చేయని అచ్చెన్నాయుడు వైఎస్సార్‌పీపీ ప్ర భుత్వంపై విషప్రచారానికి దిగుతున్నారు. వాస్తవాలను దాచిపెట్టి అసత్యాలను వల్లె వేస్తున్నారు. ఈ వైఖరిపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది... అటు చంద్రబాబు హామీలు, ఇటు వైఎస్‌ జగన్‌ ఇప్పటికే అమలు చేసిన కార్యక్రమాలు చూస్తే ఏ ప్రభుత్వం ఏంటో, ఎవరికీ చిత్తశుద్ధి ఉందో స్పష్టమవుతుంది.

కానీ ఐదేళ్లు మంత్రి పదవి వెలగబెట్టి తన స్వప్రయోజనాల కోసం పనిచేసి జిల్లాకు అన్యాయం చేసిన కింజరాపు అచ్చెన్నాయుడు 100 రోజుల వైఎస్‌ జగన్‌ పాలనపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. గతంలో నాణ్యమైన బియ్యం ఇచ్చారట... ఇప్పుడు నాణ్యత లేని బియ్యం ఇస్తున్నారని అసత్యాలు వల్లిస్తున్నారు. గతంలో చంద్రబాబు ఎన్నో చేశారట... వాటిని కొనసాగిస్తే చాలట... వైఎస్‌ జగన్‌ ప్రత్యేకంగా ఏమీ చేయనక్కర్లేదట. దీన్నిబట్టి అచ్చెన్నకు ఎంత కంటగింపు ఉందో... ఎంత భయం పట్టుకుందో అర్థమవుతుంది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఐదేళ్లు మోసం చేసి... ఇప్పుడేమో ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తున్న వైఎస్‌ జగన్‌ను దుయ్యబట్టడటంపై ప్రజలు చీదరించుకుంటున్నారు. అసలు జనం నవ్వుకుంటారని కూడా చూడకుండా నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఏదో ఒకటి మాట్లాడకపోతే ప్రజలు మరిచిపోతారన్నట్టుగా నోరు పారేసుకుంటున్నారు. 

చంద్రబాబు నిర్వాకమిదీ..
-మహేంద్ర తనయ నది నీటిని సద్విని యోగం చేసుకునేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టుకు నాంది పలికారు. దీన్ని 2018 డిసెంబర్‌ కల్లా పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. నేటికీ ఆ ప్రాజెక్టు పనులు సగం కూడా పూర్తి చేయలేదు. 

-నారాయణపురం ఆనకట్ట ఆధునికీకరణ పనులు చేపడతామని మూడేళ్లుగా చెప్పుకొచ్చి ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నారు. 

-19 టీఎంసీల నీటి నిల్వతో హిరమండలం రిజర్వాయర్‌ను ప్రారంభిస్తానని చెప్పారు.. కా నీ మొక్కుబడిగా చేసి ప్రారంభోత్సవం చేశా రు. నేరడి బ్యారేజీ నిర్మాణం గాలికొదిలేశారు. 

-సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు మండలం సరిహద్దులో భావనపాడు వద్ద పోర్టు నిర్మిస్తామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీ నీటి మూటగానే మిగిలిపోయింది. 

-ఆమదాలవలస కో ఆపరేటివ్‌ సుగర్‌ ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తామని 2104 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారం నుంచి దిగిపోయే వరకు ఆ హామీ జోలికెళ్లలేదు. చివరికి సాధ్యం కాదంటూ చేతులెత్తేశారు. 

-ఆమదాలవలసలో పారిశ్రామిక పార్క్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఐదేళ్లలో కార్యరూపం దాల్చలేదు. 

-శ్రీకాకుళంలో రింగ్‌ రోడ్డు నిర్మిస్తామని, నగరంలో మురుగు సమస్య నిర్మూలించేందుకు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని 2014 ఎన్నికల ప్రచారంలోనే కాదు జిల్లాకొచ్చినప్పుడుల్లా చంద్రబాబు హామీ ఇస్తూనే వచ్చారు. కానీ కార్యరూపం దాల్చలేదు. 

-జిల్లాను పరిశ్రమల హబ్‌గా మార్చుతామని, పదుల సంఖ్యలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు రానున్నాయని చెప్పారు. కానీ ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదు. సోంపేట, తీర ప్రాంతాల్లో మత్స్యకార పరిశ్రమలు పెడతామని చెప్పినా ఒక్కటీ రాలేదు. 

-శ్రీకాకుళం నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియం నిర్మిస్తామనే సాకుతో టీడీపీ ప్రభుత్వం పాత కోడి రామ్మూర్తి స్టేడియాన్ని కూల్చేసింది. దీన్ని ఏడాదిలో పూర్తి చేస్తామని 2016 మే నెలలో చంద్రబాబు శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటికీ పనులు  ప్రాథమిక దశను కూడా దాటలేదు. 

-కిడ్నీ బాధితులకు ఎన్నెన్నో చెప్పారు. ఎన్నికలకు ముందు కిడ్నీ రిసెర్చ్‌ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. తర్వాత ఒక్క అడుగు పడలేదు. అది కొబ్బరికాయ కొట్టడానికే పరి మితమైంది. తొలుత మున్సిపాల్టీకి, ఆ తర్వా త గ్రామాలకు మంచినీరు అందిస్తామని చె ప్పుకొచ్చారు. జెట్టీ తదితర వాటిపై హామీలు ఇచ్చారు. కానీ ఒక్కటీ అమలుకు నోచుకోలే దు. కేవలం 590మందికి రూ.2500 పింఛను ఇచ్చారు. ఆ తర్వాత రూ.3500కు పెంచారు. అది ఏమాత్రం సరిపోదని తెలిసినా మొక్కుబడిగా సాయం చేశారు. 

-అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలకైతే అతీగతీ లేదు.

100 రోజుల్లో వైఎస్‌ జగన్‌ చేసిందిదీ..
-జిల్లావ్యాప్తంగా ఇంటింటికీ తాగునీరు అందించేందుకు రూ.3,673 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. రాష్ట్రంలో తొలి విడతగా చేపట్టాలని నిర్ణయించారు. 

-ఉద్దానం పరిధిలోని 827 గ్రామాలకు ఇంటింటికి శుద్ధ జలాలు అందించేందుకు రూ.600 కోట్లతో మంచినీటి పథకాన్ని మంజూరు చేసి శంకుస్థాపన చేశారు.

-కిడ్నీ బాధితులకు రూ.10 వేల ఫించను పెంచడమే కాకుండా అందజేస్తున్నారు. టీడీ పీ హయాంలో తొలుత రూ.2,500, ఎన్నికలకు ముందు రూ.3,500కు పెంచి 590మందికి అందజేయగా, వైఎస్సార్‌ ప్రభుత్వంలో 726మందికి రూ.10 వేల పింఛను అందజేస్తున్నారు. అంతే కాకుండా స్టేజ్‌ 3 నుంచే కిడ్నీ బాధితులకు రూ.5 వేల పింఛను అందజేస్తామని పలాస సభ సాక్షిగా ప్రకటించారు. 

-రూ.50 కోట్లతో సూపర్‌ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రి, కిడ్నీ రిసెర్చ్‌ సెంటర్, అతి పెద్ద డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడమే కాకుండా శంకుస్థాపన చేశారు. 

-మత్స్యకారుల కోసం రూ.11.95 కోట్లు మంజూరు చేసి, ఫిషింగ్‌ జెట్టీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 

-తెల్ల రేషన్‌ కార్డుదారులకు ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 8 లక్షల 32 వేల 636 కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి.  

-తిత్లీ తుఫాన్‌కు నష్టపోయిన వారికి కొబ్బరి రైతులకు ఒక్కో చెట్టుకు రూ.3000, హెక్టార్‌ జీడి తోటకు రూ.50 వేలు  ప్రకటించడమే కాకుండా నిధులు మంజూరు చేసి పంపిణీ చేస్తున్నారు. దీనివలన 52164 మంది కొబ్బ రి రైతులు రూ.479.26 కోట్లు, 78,108మంది జీడి రైతులు రూ.113.62 కోట్లు లబ్ధి పొందుతున్నారు.  

-2017–18 రబీ సీజన్‌లో మొక్కజొన్న పండించిన రైతులు గిట్టుబాటు ధర లేక అప్పుల్లో కూరుకుకుపోయిన రైతుల కోసం రూ.11.17 కోట్లు మంజూరు చేశారు. జిల్లాలో 15,915మంది ప్రయోజనం పొందారు.

-ప్రతి 500 కిడ్నీ రోగులకు హెల్త్‌ వర్కర్లను ఏర్పాటు చేస్తామని, కిడ్నీ బాధితులతోపాటు సహాయకులకు ఉచిత బస్సు అందజేస్తానని చెప్పారు. కిడ్నీ రోగులకు ఉచిత ల్యాచ్‌ పరీక్షలతోపాటు నాణ్యమైన మందులు అందుబాటులోకి తీసుకొస్తానని పేర్కొన్నారు. త్వరలోనే ఆచరణలో పెట్టనున్నారు.

-ఇచ్ఛాపురం నియోజకవర్గంలో బెంతు ఒరి యాలు, బుడగ జంగాల సమస్యలకు పరిగణనలోకి తీసుకుని మంచి చేయాలనే ఉద్దేశంతో  జేసీ శర్మ వన్‌మేన్‌ కమిషన్‌ వేశారు.

-వంశధార నదిపై నేరడి వద్ద బ్యారేజి నిర్మాణంతోపాటు మహేద్రంతనయ ఆఫ్‌షోర్‌ రిజ్వాయర్‌ ప్రాజెక్టు, నారాయణ పురం ఆనకట్ట, తోటపల్లి కాలువల ఆధునీకరణ పనులను పరుగులు తీయిస్తానని మాటిచ్చారు.  ఇవి కేవలం జిల్లాకు ప్రత్యేకంగా చేసిన మేళ్లు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అమలయ్యే నిర్ణయాలతో దాదాపు ప్రతి పథకంలోనూ జిల్లా ప్రజలు లబ్ధి పొందుతున్నారు.

మరిన్ని వార్తలు