మరి దీన్ని ఏమంటారు?

9 Apr, 2020 11:46 IST|Sakshi

సాక్షి, అమరావతి: విపత్కర పరిస్థితుల్లోనూ ‘పచ్చ’ నాయకులు తమ బుద్ధి చూపించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు లాక్‌డౌన్‌ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ మాస్కులు, కూరగాయలు పంపిణీ పేరుతో యథేచ్ఛగా అందరి మధ్య తిరుగుతూ స్థానిక ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. విజయవాడ టీడీపీ మేయర్‌ అభ్యర్థి, ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నా నిత్యం రైతుబజార్లు, మార్కెట్లు, ఇతర ప్రాంతాల్లో సంచరిస్తూ మాస్కుల పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో నిత్యావసర వస్తువుల బ్యాగులపై ఎమ్మెల్యే బాలకృష్ణ బొమ్మలు ముద్రించి పంచుతున్నారు. 

మచ్చుకు కొన్ని...

విశాఖ టీడీపీ మేయర్‌ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్న పీలా శ్రీనివాసరావు సరుకులు ఇస్తూ ఫొటోతో పాటు పాంప్లేట్‌ ఇస్తున్నారిలా..


చిత్తూరు జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి రాజశేఖర్‌ ఏకంగా చంద్రన్న కానుక సంచులు పంచుతున్నారిలా..  


గుంటూరు జిల్లా గుజ్జనగండ్ల ప్రాంతంలో టీడీపీ కౌన్సిలర్‌ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర పార్టీ కండువాలు, జెండాలతో ప్రచారం చేస్తున్నారిలా.. 

మరిన్ని వార్తలు