వెబ్‌సైట్ల సాక్షిగా కోడ్‌ ఉల్లంఘన 

15 Mar, 2019 10:03 IST|Sakshi

ఇంకా కొనసాగుతున్న ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలు

విశాఖసిటీ : సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైనప్పటి నుంచి కోడ్‌ వర్తిస్తోంది. కోడ్‌ కూసిన వెంటనే.. ప్రభుత్వ వెబ్‌సైట్లలో ఉన్న ఫొటోల్ని మార్చాల్సి ఉంటుంది. కానీ.. ఇంత వరకు ఏపీ ప్రభుత్వం మాత్రం కోడ్‌ మాకు వర్తించదన్నట్లుగా నిర్లక్ష్యపు ధోరణిని ప్రదర్శిస్తోంది. ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల వెబ్‌సైట్లలో సీఎం చంద్రబాబు, అనేక మంది మంత్రుల ఫొటోలు దర్శనమిస్తున్నాయి. ఇక ఆయా వెబ్‌సైట్లను పరిశీలిస్తే..   డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌లో సీఎంగా చంద్రబాబు, ఆర్థిక శాఖ మంత్రిగా యనమల రామకృష్ణుడు, బీసీవెల్ఫేర్‌ కమిషనర్‌ వెబ్‌సైట్‌లో బాబు, మంత్రి అచ్చెన్నాయుడు, ఏపీ అర్బన్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌లో బాబు, నారాయణ ఫొటోలు ఉన్నాయి. ఓవైపు.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అన్ని వెబ్‌సైట్లలోనూ ప్రధానమంత్రి, ఇతర కేంద్ర మంత్రుల ఫొటోలను తొలగిస్తూ.. ఎన్నికల కమిషన్‌ నియమాల్ని పాటిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇలా బరితెగించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు