షరతుల్లేకుండా ఎవరైనా చేరొచ్చు

19 Oct, 2017 11:17 IST|Sakshi

అన్ని పార్టీల నేతలు మాతో సంప్రదిస్తున్నారు

కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ కుంతియా

సాక్షి, న్యూఢిల్లీ: ఏ పార్టీ నేతలైనా షరతు ల్లేకుండా కాంగ్రెస్‌లో చేరవచ్చని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఆర్‌సీ కుంతియా అన్నారు. టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారని ఉహాగా నాలు జోరందుకున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తమ పార్టీపై నమ్మకంతో చేరేవారిని ఎవరినైనా ఆహ్వానిస్తామని రేవంత్‌రెడ్డి చేరికను పరోక్షంగా ప్రస్తావించారు. రేవంత్‌ చేరికపై ఎలాంటి సమాచారం లేదని చెబుతూనే.. ఎవరొచ్చినా చేర్చుకుంటామని స్పష్టం చేశారు.

టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తెలంగాణలో క్షేత్రస్థాయి నుంచి బలపడేందుకు అన్ని చర్యలు తీసు కొని.. 2019 ఎన్నికలకు సిద్ధమవుతామన్నా రు. సీఎం కేసీఆర్‌ బంగారు తెలంగాణ నిర్మిస్తామని చెప్పి కుటుంబ అభివృద్ధికే పరిమితమయ్యారని విమర్శించారు. ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించిన టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల్లో నమ్మకం కోల్పోయిందన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ఏకైక ప్రత్యామ్నాయ పార్టీ కాంగ్రెస్సేనని పేర్కొన్నా రు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, సమస్యలు ఏవైనా ఉంటే అంతర్గతంగా చర్చించుకొని పరిష్కరిం చుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ మరింత బలహీనపడిందని, అమిత్‌ షా ప్రభా వం లేకపోవడంతో బలపడే అవకాశాలు లేవని గుర్తించే ఆ పార్టీ తెలంగాణకు చెందిన నేతను కేంద్ర కేబినెట్‌ నుంచి తప్పించిందని విమర్శించారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకుంటామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు