కిక్కే..కిక్కు

11 May, 2019 11:28 IST|Sakshi

కొల్చారం(నర్సాపూర్‌): వరుస ఎన్నికలతో మద్యానికి ‘ఫుల్‌’ డిమాండ్‌ ఏర్పడింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు.. ఆ తర్వాత పంచాయతీ పోరు.. అనంతరం ప్రాదేశిక సమరం ఇలా ఒక దాని తర్వాత ఒకటి వస్తుండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు మద్యాన్ని ఎరగా వేస్తున్నారు. దీంతో విక్రయాలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రస్తుతం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ మద్యం ఏరులై పారుతోంది. గడిచిన ఐదు రోజుల వ్యవధిలో జిల్లాలో ఏకంగా రూ.23.56కోట్ల మద్యం అమ్మకాలు సాగడం ఎన్నికల్లో మద్యం ప్రభావం ఏ మేరకు ఉందనేది తేటతెల్లమవుతోంది.

జిల్లాలోని 108 మద్యం దుకాణాలు, బార్ల ద్వారా గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 15రోజుల్లో రూ.44.41కోట్ల మ ద్యం అమ్మకాలు జరిగితే, పంచాయతీ ఎన్నికల్లో 16రోజుల వ్యవధిలో రూ.56.75కోట్ల విక్రయాలు జరిగాయి. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పోలిం గ్‌కు ఐదు రోజుల వ్యవధిలో రూ. 20.84కోట్ల మ ద్యం అమ్ముడైంది.

ప్రస్తుతం ఆ రికార్డులను బద్ధ లు కొడుతూ రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా ఐదు రో జుల వ్యవధిలో ఏకంగా రూ.23.58కోట్ల మ ద్యం అమ్మకాలు జరగడం విశేషం. వీటిలో లిక్కర్‌ రూ.16,88,1,534, బీర్లు రూ.6,70, 59,343 విక్రయాలు ఉన్నాయి. మూడో విడత ఎన్నికలు ముగిసే నాటికి విక్రయాలు మరింతగా పెరగనున్నాయి.

మరిన్ని వార్తలు