ఇది రైతు ప్రభుత్వం కాదు : కోదండరాం

20 Mar, 2018 15:19 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్ : తెలంగాణ సాధించుకున్నది ఏ ఒక్కరి కోసమో కాదని రైతులు గౌరవంతో బతికే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రొఫెసర్‌ కోదండరాం డిమాండ్‌ చేశారు. మంగళవారం డిచ్‌పల్లిలో జరిగిన జేఏసీ రైతు సదస్సులో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 500 గ్రామాల రైతులు ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు ఇవ్వాలని, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుకుంటున్నారని అన్నారు.

ప్రభుత్వం తలచుకుంటే రైతు కష్టాలు తొలగిపోతాయని కోదండరాం పేర్కొన్నారు. రైతు కష్టపడి తన పిల్లలకు చదువు చెప్పించినా.. వారికి ఉద్యోగం వస్తుందనే నమ్మకం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తమ సమస్యలు మొరపెట్టుకున్నా ఆయన స్పందించడం లేదని ఆరోపించారు. తెలంగాణలో కూడా మహారాష్ట్రలో మాదిరి రైతు ఉద్యమం రావాలని కోదండరాం ఆకాక్షించారు. ప్రధాని మోదీ కూడా రైతు సమస్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతు సమస్యలను లేవనెత్తేందుకు జేఏసీ త్వరలోనే ఒక బలమైన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

మరిన్ని వార్తలు