విప్ ధిక్కరణ.. ఎంపీపీపై వేటు..!

2 Jul, 2019 21:42 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి : పార్టీ విప్‌ ధిక్కరించిన ఓ ఎంపీపీపై వేటు పడింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలోని నాగిరెడ్డిపేట్‌ ఎంపీపీ కృష్ణవేణి కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎంపీటీసీగా గెలుపొందారు. పార్టీ విప్‌ ధిక్కరించి టీఆర్‌ఎస్ మద్దతుతో ఎంపీపీగా గెలుపొందారు. దీనిపై కాంగ్రెస్ నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. విప్‌ తీసుకున్న సంతకం తనది కాదని కృష్ణవేణి బుకాయించడంతో ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపారు. సంతకం ఆమెదే అని తేలడంతో కృష్ణవేణిపై అనర్హతవేటు వేయాలంటూ కాంగ్రెస్ నాయకులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. పూర్వాపరాలు పరిశీలించిన హైకోర్టు ఎంపీపీ కృష్ణవేణిపై అనర్హత వేటు వేయాలని ప్రిసైడింగ్‌ అధికారుకు ఆదేశాలు జారీచేసింది.

మరిన్ని వార్తలు